×
Ad

New Income Tax Act : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. కొత్త పన్ను చట్టంపై కీలక ప్రకటన.. ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి..

New Income Tax Act : 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనుంది.

New Income Tax Act

  • ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం
  • కేంద్ర వార్షిక బడ్జెట్ 2026ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
  • చిన్న పన్ను చెల్లింపుదారులకు కొత్త స్కీమ్
  • 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం

New Income Tax Act : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. కొత్త పన్ను చట్టంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం పార్లమెంటులో 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త పన్ను చట్టం అమల్లోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు.

రాబోయే సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఆర్థిక వ్యూహాన్ని కూడా ఆవిష్కరించారు. 1961- ఆదాయపు పన్ను చట్టం స్థానంలో జూలై 2025లో నోటిఫై చేసిన కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ నుంచి కొత్త చట్టంగా రూపుదాల్చనుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో కీలకమైన అంశం వ్యక్తిగత ఆదాయపు పన్ను కాగా. పన్ను చెల్లింపుదారుల అంచనాలకు తగినట్టుగా బడ్జెట్ రూపొందించినట్టు ఆమె తెలిపారు.

చిన్న టాక్స్ పేయర్ల కోసం కొత్త స్కీమ్ :
2027 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం నియమ ఆధారిత ఆటోమేటెడ్ ప్రాసెస్ కూడా ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. గత ఏడాదిలో కేంద్ర బడ్జెట్ (2025-26)లో జీతం పొందే మధ్యతరగతికి రిలీఫ్ అందించేందుకు ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని సవరించింది.

2025 బడ్జెట్‌లో కొత్త విధానం కింద రూ. 12 లక్షల వరకు ఆదాయం (నెలకు రూ. 1 లక్ష సగటు ఆదాయం)పై ఎలాంటి పన్ను ఉండదు. రూ. 75వేలు స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు ఈ పరిమితి రూ. 12.75 లక్షలకు చేరుతుంది.

Read Also : Union Budget 2026 : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రేర్ ఎర్త్ కారిడార్.. అంటే ఏంటి? దానివల్ల వచ్చే లాభాలివే..

మధ్యతరగతి వారి చెల్లించాల్సిన పన్నులను భారీగా తగ్గించింది. తద్వారా వారి చేతుల్లో ఎక్కువ డబ్బు మిగిలేందుకు అవకాశం ఉంటుంది. గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడులు కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

2025 కేంద్ర బడ్జెట్ కొత్త పన్ను విధానం కింద పన్ను శ్లాబ్‌లను విస్తరించింది. రూ. 4 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను ఉండదు. అత్యధిక రేటు 30 శాతం రూ. 24 లక్షల కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే వర్తిస్తుంది.

కొత్త పన్ను విధానంలో కేంద్ర బడ్జెట్ పన్ను రేట్లు ఇవే :

  • 0 నుంచి రూ. 4 లక్షల వరకు పన్ను లేదు
  • రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు : 5 శాతం
  • రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలు : 10 శాతం
  • రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలు : 15 శాతం
  • రూ. 16 లక్షల నుంచి రూ. 20 లక్షలు : 20 శాతం
  • రూ. 20 లక్షల నుంచి రూ. 24 లక్షలు : 25 శాతం
  • రూ. 24 లక్షలపైన : 30 శాతం

అదేవిధంగా సవరించిన ఐటీఆర్ ఫైలింగ్ గడువును కూడా పొడిగించారు. గతంలో డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. ఇప్పుడు మార్చి 31కి పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.