Nissan Gravite MPV
Nissan Gravite MPV : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా నుంచి కొత్త ఎంపీవీ కారు వచ్చేస్తోంది. 7-సీటర్ ఎంపీవీ నిస్సాన్ గ్రావైట్‌ను ఫిబ్రవరి 17న భారత మార్కెట్లో కంపెనీ లాంచ్ చేయనుంది.
ఈ కొత్త నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ ఫ్యామిలీ కస్టమర్లకు బెస్ట్ కారు. సరసమైన ధరలో 7-సీటర్ కారు కోరుకునేవారికి అద్భుతమైన కారు. ఈ కొత్త కారు రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ సీఎంఎఫ్-ఎ+ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. రెనాల్ట్ ట్రైబర్‌తో నేరుగా పోటీపడుతుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నిస్సాన్ గ్రావిట్ ఎంపీవీ డిజైన్ :
కొత్త నిస్సాన్ గ్రావిట్ ఎంపీవీ ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. లోపల ఎక్కువ స్పేస్ అందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణానికి బెస్ట్ కారు. ఈ కొత్త కారులో ఫ్రంట్ సైడ్ సి-ఆకారపు ఎల్ఈడీ లైట్లు, భారీ బోల్డర్ గ్రిల్, రీడిజైన్ బంపర్, రూఫ్ రెయిల్స్, బాడీ క్లాడింగ్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కొత్త నిస్సాన్ గ్రావిట్ చుట్టూ ఎల్ఈడీ టెయిల్ లాంప్‌లు, కొత్త బంపర్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉంటుంది.
కొత్త నిస్సాన్ గ్రావిట్ ఎంపీవీ ఫ్లాట్-ఫ్లోర్ డిజైన్‌తో వస్తుంది. ఎక్కువ లెగ్‌రూమ్‌ను అందిస్తుంది. రెండవ వరుస సీట్లు ముందుకు మూవ్ చేయొచ్చు. వంగవచ్చు, మూడవ వరుస సీట్లు పిల్లలకు లేదా చిన్న ప్రయాణాలకు బెస్ట్. బ్యాక్ సీట్లను ఫోల్డ్ చేయొచ్చు. లగేజ్ స్పేస్ పెంచుకోవచ్చు.
నిస్సాన్ గ్రావిట్ MPV ఫీచర్లు :
కొత్త నిస్సాన్ గ్రావిట్ ఎంపీవీలోలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బ్యాక్ ఏసీ వెంట్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ వంటి అనేక అడ్వాన్స్ ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. కొత్త కారులో 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు.
నిస్సాన్ గ్రావిట్ MPV ధర (అంచనా) :
ధర పరంగా పరిశీలిస్తే.. కొత్త నిస్సాన్ గ్రావిట్ ఎంపీవీ రూ.6 లక్షల నుంచి రూ. 7 లక్షలు ఉంటుందని అంచనా. టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 13 నుంచి రూ. 14 లక్షలు మధ్య ఉండొచ్చు.