Portronics Mini UPS : కొత్త పోర్ట్రానిక్స్ రౌటర్ యూపీఎస్‌ వచ్చేసింది.. ఇక పవర్ పోయినా Wi-Fi వర్క్ చేస్తుంది.. ధర ఎంతో తెలుసా?

Portronics Mini UPS : పోర్ట్రానిక్స్ కైనెటిక్స్ 8K మినీ యూపీఎస్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 8000mAh బ్యాటరీ, 5 గంటల వరకు బ్యాకప్, USB-A, టైప్-C, మల్టీ DC అవుట్‌పుట్‌లు ఉన్నాయి.

Portronics Mini UPS

  • పోర్ట్రానిక్స్ కైనెటిక్స్ 8K 8000mAh బ్యాటరీతో వస్తుంది
  • కంపెనీ 5 గంటల వరకు పవర్ బ్యాకప్ ఇస్తుంది
  • మినీ యూపీఎస్ USB-A, టైప్-C, 12V DC అవుట్‌పుట్‌

Portronics Mini UPS : మీరు వర్క్ ఫ్రమ్ హోం చేస్తుంటారా? అయితే, మీకు తప్పనిసరిగా ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఇంటి దగ్గర పవర్ పోతుంటుంది. అలాంటి సమయంలో ఇంటర్నెట్ రూటర్ పవర్ కూడా ఆగిపోతుంది. ఇలాంటి సమయాల్లో మళ్లీ పవర్ వచ్చేవరకు ఇంటర్నెట్ యాక్సస్ చేయలేరు. ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదు. భారత మార్కెట్లోకి
కొత్త పోర్ట్రానిక్స్ కైనెటిక్స్ 8K మినీ యూపీఎస్‌ వచ్చేసింది.

ఈ యూపీఎస్ వై-ఫై రౌటర్లు, మోడెమ్‌లు, ఎంపిక చేసిన సెక్యూరిటీ కెమెరాల కోసం (Portronics Mini UPS) ప్రత్యేకంగా రూపొందిన కాంపాక్ట్ పవర్ బ్యాకప్ డివైజ్. కంపెనీ ప్రకారం.. పవర్ కట్ సమయంలో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. కైనెటిక్స్ 8Kలో 8000mAh బ్యాటరీ ఉంది. 5 గంటల వరకు పవర్ బ్యాకప్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది.

ధర, లభ్యత విషయానికి వస్తే.. :
పోర్ట్రానిక్స్ కైనెటిక్స్ 8K ధర రూ. 2,999గా ఉంది. అయితే, లాంచ్ ఆఫర్ల కింద ఈ డివైజ్ రూ. 1,699 ప్రారంభ ధరకే కొనేసుకోవచ్చు. ఈ మినీ యూపీఎస్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. దీనికి 12 నెలల వారంటీ కూడా లభిస్తుంది.

Read Also : Vivo X Fold 6 : వివో లవర్స్ కోసం 200MP కెమెరాతో వివో X ఫోల్డ్ 6 వచ్చేస్తోంది.. శాంసంగ్, హానర్ ఫోన్లకు దబిడి దిబిడే..

పోర్ట్రానిక్స్ కైనెటిక్స్ 8K 8000mAh బ్యాటరీతో వస్తుంది. కనెక్ట్ చేసిన డివైజ్ పవర్ వినియోగం, వాడకాన్ని బట్టి బ్యాకప్ టైమ్ మారవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ మినీ యూపీఎస్ ప్రధానంగా 12V డీసీ వై-ఫై రౌటర్లకు సపోర్టు ఇస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ మినీ డివైజ్ రిమోట్ వర్క్, ఆన్‌లైన్ క్లాసులు, వీడియో స్ట్రీమింగ్, స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌ల సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్‌ అంతరాయం లేకుండా ఉంటుంది.

మల్టీ అవుట్‌పుట్ ఆప్షన్లతో కనెక్టవిటీ :
ఈ డివైజ్ కనెక్టివిటీ కోసం మల్టీ అవుట్‌పుట్ ఆప్షన్లను అందిస్తుంది. 5V/2.1A, 9V/2A, 12V/1.5A DC అవుట్‌పుట్‌లను అందిస్తుంది. USB-A, టైప్-సి పోర్ట్‌లు కూడా అందిస్తోంది. కంపెనీ ప్రకారం.. ఈ పోర్ట్‌లను బ్రాడ్‌బ్యాండ్ రౌటర్లు, ONT/ఫైబర్ డివైజ్‌లు, సెక్యూరిటీ కెమెరాలు, ఇతర లో పవర్ ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఉపయోగించవచ్చు.

కైనెటిక్స్ 8K ప్లగ్-అండ్-ప్లే డిజైన్‌తో వస్తుంది. దీనికి ఎలాంటి సెటప్ అవసరం ఉండదు. ఈ డివైజ్ ఇంటర్నల్ వెంటిలేషన్ సిస్టమ్ కూడా ఉంది. ఎక్కువసేపు వాడినా హీట్ మెనేజ్‌మెంట్ అందిస్తుంది.

డిజైన్ పరంగా కైనెటిక్స్ 8K కాంపాక్ట్, తేలికైన షేప్ అందిస్తుంది. కంపెనీ క్రీమ్-ఐవరీ కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. రౌటర్, వర్క్‌స్టేషన్ లేదా ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్ పక్కనే ఉంచవచ్చు.