Income Tax Relief
Union Budget 2026 : ఈసారి బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను లో ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. పన్ను శ్లాబులు ఎప్పటిలానే కొనసాగుతాయి. అయితే, సామాన్యులకు ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. పన్ను నియమాలను మాత్రం సులభతరం చేసింది.
మధ్యతరగతి కుటుంబాలు, వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబ్‌లలో మార్పులతో భారీ ఉపశమనం పొందాయి. తక్కువ ఆదాయం పొందే వ్యక్తులు ఇప్పుడు తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దాంతో వారికి ఎక్కువగా సేవింగ్స్ ఉంటాయి. చేతిలో డబ్బు మిగులుతుంది. ఈ సేవింగ్ అయిన మొత్తాన్ని పిల్లల స్కూలు ఫీజులు, ఇతర గృహ అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేసుకోవచ్చు.
కేంద్రం ప్రభుత్వం పన్ను శ్లాబులలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, ఐటీఆర్ దాఖలు విషయంలో అనేక మార్పులు చేసింది. విదేశీ విద్యతో పాటు సీనియర్ సిటిజన్లకు మినహాయింపు పరిమితిని రూ. లక్షకు రెట్టింపు చేసింది.
అద్దెపై టీడీఎస్ తగ్గింపు పరిమితిని రూ. 2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచింది. ఇవన్నీ సామాన్యులపై కాస్త భారాన్ని తగ్గిస్తాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 36 రకాల మందులపై కూడా కేంద్రం పూర్తిగా పన్ను ఎత్తేసింది. దాంతో తీవ్రమైన వ్యాధులకు వాడే మందులు చౌకగా లభించనున్నాయి.
రూ. 4 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్ :
కొత్త పన్ను స్లాబ్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదు. మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే విషయమే. ఇప్పుడు, మీ వార్షిక ఆదాయం రూ. 4 లక్షల వరకు ఉంటే.. మీరు ఒక్క పైసా కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
Read Also : Union Budget 2026: యాక్సిడెంట్ బాధితులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు బడ్జెట్‌లో గుడ్‌న్యూస్
అదే సమయంలో రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్య ఆదాయాలపై కేవలం 6శాతం పన్ను మాత్రమే పడుతుంది. ఉదాహరణకు.. మీలో ఎవరైనా రూ. 6 లక్షలు సంపాదిస్తే.. రూ.12వేలు మాత్రమే పన్ను చెల్లించాలి. గతంలో పన్నుతో పోలిస్తే చాలా తక్కువే..
మీరు రెండు ఇళ్లు ఉంటే.. ఎలాంటి షరతులు లేకుండా రెండు ఇళ్లపై పన్ను మినహాయింపు పొందవచ్చు. గతంలో, ఈ ప్రయోజనం కేవలం ఒక ఇంటికి మాత్రమే పరిమితంగా ఉండేది.
సీనియర్ సిటిజన్ల కోసం :
సీనియర్ సీటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 50వేల నుంచి రూ. లక్షకు పెంచింది. వృద్ధులు ఇప్పుడు తమ పెన్షన్‌లో ఎక్కువ భాగాన్ని సొంత అవసరాలకు ఖర్చు చేసుకోవచ్చు.
అద్దెపై కొత్త టీడీఎస్ లిమిట్ :
మీరు సంవత్సరానికి రూ. 6 లక్షల వరకు అద్దె చెల్లిస్తే.. ఇకపై టీడీఎస్ తగ్గదు. గతంలో ఈ పరిమితి రూ. 2.4 లక్షలు మాత్రమే.
ఐటీఆర్ తప్పుల సవరణకు అదనపు సమయం :
అప్‌డేటెడ్ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు మీకు ఇప్పుడు మరింత సమయం లభిస్తుంది అనమాట.
చిన్న పన్ను చెల్లింపుదారులకు రిలీఫ్ :
విద్యార్థులు, టెక్ నిపుణులు, విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు వంటి చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం 6 నెలల విదేశీ ఆస్తుల బహిర్గత పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా భారీగా పెనాల్టీలు పడకుండా స్వచ్ఛందంగా లేదా విదేశీ ఆస్తులను లేదా ఆదాయాన్ని బహిర్గతం చేసుకోవచ్చు.
గత ఏడాది, అంచనా సంవత్సరం అనే పాత భావన రద్దు చేసి ఇప్పుడు ‘వన్ టైమ్ స్కీమ్’అందుబాటులో ఉంటుంది. మీరు ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేసినా ఎలాంటి పెనాల్టీ పడకుండా టీడీఎస్ వాపసును క్లెయిమ్ చేసుకోవచ్చు.