Small UPI Payments : UPIలో గేమ్ చేంజర్ ఫీచర్.. చిన్న పేమెంట్లకు ఇక PIN అవసరం లేదు.. ఎలా వాడాలి?
Small UPI Payments : భారతీయ యూపీఐ యూజర్లు ఇప్పుడు పిన్ ఎంటర్ చేయకుండానే బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా రూ. 5వేల వరకు పేమెంట్లు చేయవచ్చు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Small UPI Payments
- యూపీఐ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్
- పిన్ లేకుండానే చిన్న మొత్తంలో పేమెంట్లు చేయొచ్చు
- ఫింగర్ ఫ్రింట్, ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా పేమెంట్లు
Small UPI Payments : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. దేశంలో డిజిటల్ పేమెంట్లు వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు యూపీఐ యూజర్ల సరికొత్త ఫీచర్ వచ్చేసింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే పేమెంట్లు చేయవచ్చు.
మీరు ప్రతిసారీ మీ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఫింగర్ ఫ్రింట్, ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా కూడా పేమెంట్లు చేయవచ్చు. అయితే, ఈ ఫీచర్ ప్రత్యేకంగా చిన్నమొత్తంలో లావాదేవీల కోసం ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కొత్త బయోమెట్రిక్ యూపీఐ ఫీచర్ ఏంటి? :
యూపీఐ పిన్‌కు బదులుగా బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఈ ఫీచర్ వాడొచ్చు. ఇకపై ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ స్కాన్ ద్వారా ఈజీగా పేమెంట్లు చేయవచ్చు. అయితే, ప్రస్తుతం రూ. 5వేల వరకు ఉన్న లావాదేవీలకు మాత్రమే అందుబాటులో ఉంది. అంతకంటే ఎక్కువ మొత్తంలో పేమెంట్లు చేయాలంటే మాత్రం పిన్ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Read Also : Neredmet Mystery : నేరేడ్మెట్ మిస్టరీ.. కిచెన్ కింద దాగిన అసలు నిజం.. 4 నెలల తర్వాత షాకింగ్ ట్విస్ట్!
ఐసీఐసీఐ బ్యాంక్ యాప్ ఫీచర్ :
మీరు ఐసీఐసీఐ బ్యాంక్ (iMobile) యాప్ ద్వారా ఈ ఫీచర్‌ను పొందవచ్చు. తద్వారా వినియోగదారులు ఇప్పుడు బయోమెట్రిక్స్ ఉపయోగించి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం, ఆన్లైన్ కొనుగోళ్లు చేయడం, వ్యక్తిగత లావాదేవీలు వంటివి చేయవచ్చు. ఈ ఫీచర్ మీ మొబైల్ ఫోన్లలో ఇప్పటికే ఉన్న బయోమెట్రిక్ డేటా ఆధారంగా వర్క్ అవుతుంది. అయితే, మీరు అవసరాన్ని బట్టి ఈ ఫీచర్ ఆన్ లేదా ఆఫ్ కూడా చేయొచ్చు.
ఫోన్‌పేలోనూ ఈ సౌకర్యం :
అంతేకాదు.. ఫోన్‌పే యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. తద్వారా మీరు కేవలం ఒక్క ట్యాప్‌తో పేమెంట్లు చేయవచ్చు. ఒకవేళ బయోమెట్రిక్స్ ఫెయిల్ అయితే.. పిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. రద్దీగా ఉండే ప్రాంతాలలో సురక్షితమైన పేమెంట్ల కోసం ఈ ఫీచర్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.
క్రెడ్, పేటీఎం ద్వారా చేయొచ్చు :
ఫోన్‌పే మాత్రమే కాదు.. మీరు క్రెడ్ (CRED) ద్వారా కూడా బయోమెట్రిక్ పేమెంట్లు చేయవచ్చు. పేటీఎం (Paytm)లో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మీరు బయోమెట్రిక్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా లావాదేవీలను ఈజీగా పూర్తి చేయొచ్చు.
