Neredmet Mystery : నేరేడ్మెట్ మిస్టరీ.. కిచెన్ కింద దాగిన అసలు నిజం.. 4 నెలల తర్వాత షాకింగ్ ట్విస్ట్!
Neredmet Mystery : నేరేడ్మెట్లో సంచలన కేసు మిస్టరీ వీడింది. అసలు నిందితుడు ఎవరో పోలీసులు కనిపెట్టేశారు. కిచిన్ కింద దాగిన క్రైమ్ మిస్టరీ దాదాపు 4 నెలల తర్వాత బయటపడింది. ఈ క్రైమ్ ట్విస్ట్ వెనక అసలు స్టోరీ ఇదే..
Neredmet Mystery ( Image Credit : Gemini AI )
- నేరేడ్మెట్ లో వీడిన మిస్టరీ కేసు
- 4 నెలల తర్వాత అసలు ట్విస్ట్ వెలుగులోకి
- మల్లేష్, వెంకటరాములు మద్యం మత్తులో ఘర్షణ
- కిచెన్ లో మృతదేహం పాతిపెట్టి మల్లేష్ పరారీ
Neredmet Mystery : హైదరాబాద్‌లోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నేరేడ్మెట్లో సంచలన కేసు నిజంగానే క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఈ సంచలన హత్య కేసు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
కూలి పనులు చేస్తూ జీవనం సాగించే మల్లేష్, వెంకటరాములు మధ్య ఘర్షణే ఈ ఘటనకు మూల కారణం. గత డిసెంబర్లో జరిగిన మందుపార్టీలో ఇద్దరూ మద్యం మత్తులో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.
ఆ కోపావేశంలో మల్లేష్, వెంకటరాములను కిరాతకంగా హత్యచేశాడు. పైగా ఆ నేరాన్ని దాచిపెట్టేందుకు క్రైమ్ థ్రిల్లర్ మూవీ తరహాలో పెద్ద ప్లానే వేశాడు. తన నేరాన్ని దాచిపెట్టేందుకు వెంకటరాములను మృతదేహాన్ని ఇంటి కిచెన్ లోనే తవ్వి పాతిపెట్టాడు. పైగా సిమెంట్ చేసి ఎలాంటి ఆధారాలు లేకుండా మాయం చేయాలని చూశాడు. హత్య చేసిన అనంతరం మల్లేష్ అక్కడి నుంచి పరారైపోయాడు.
మల్లేష్ పరారీ తర్వాత ఆ ఇంటి యజమాని అదే ఇంటిని కొద్ది రోజుల తర్వాత మరొకరికి కిరాయికి ఇచ్చాడు. అసలు కథ ఇక్కడే మలుపు తిరిగింది. కొత్తగా వచ్చిన కుటుంబం ఇంటిని శుభ్రం చేస్తుండగా కిచెన్ వద్ద భారీగా దుర్వాసన వచ్చింది.
దాంతో అనుమానం వచ్చిన ఆ కుటుంబం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిచెన్ ఫ్లోర్‌ను తవ్వి చూడగా పాతిపెట్టిన మృతదేహం బయటపడింది. దాంతో వెంటకరాములు హత్య వెనుక అసలు మిస్టరీ వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేశారు. అన్ని ఆధారాలను కూడా సేకరించారు. మల్లేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 4 నెలల తర్వాత నిందితుడు మల్లేష్ ను పట్టుకుని ఈ సంచలన హత్య కేసుకు తెరదించారు పోలీసులు. విచారణలో అతడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. సాధారణ గొడవగా మొదలైన ఈ సంఘటన దారుణ హత్యగా మారింది.
