EPFO Nominee : PF ఖాతాలో నామినీ లేకపోతే డబ్బు ఎవరికీ వెళ్తుంది? నిజం తెలిస్తే షాక్ అవుతారు!
EPFO Nominee : పీఎఫ్ ఖాతాలో నామినీ లేకుండా ఉద్యోగి మరణిస్తే అందులోని డబ్బు ఎవరికి చెందుతుందని చాలా మందికి సందేహం ఉంటుంది. ఈ డబ్బులను పొందే వ్యక్తి ముందుగా ఈపీఎఫ్ఓ రూల్స్ తెలుసుకోవాల్సిందే..
No Nominee in PF Account
- మీ పీఎఫ్ ఖాతాలో నామినీ ఇంకా యాడ్ చేయలేదా?
- నామినీ లేకపోతే పీఎఫ్ ఖాతాలో డబ్బులకు ఏమౌతుంది?
- ఉద్యోగి మరణానంతరం ఖాతాలో డబ్బులు ఎవరికి చెందుతాయి?
EPFO Nominee : పీఎఫ్ ఖాతా అనేది కేవలం సేవింగ్స్ స్కీమ్ కాదు.. ఉద్యోగస్తుల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కూడా. అయితే, చాలా మంది ఉద్యోగులు తమ ఈపీఎఫ్ఓ ఖాతాకు నామినీ పేరు యాడ్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఈ చిన్న నిర్లక్ష్యం భవిష్యత్తులో మీ కుటుంబానికి అతిపెద్ద సమస్యగా మారవచ్చు. అందుకే పీఎఫ్ సభ్యులందరూ తమ ఖాతాకు నామినీని యాడ్ చేయడం చాలా ముఖ్యం కూడా.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కూడా తమ సభ్యులకు పీఎఫ్ ఖాతాలో నామినీ పేరు రిజిస్టర్ చేయాల్సిందిగా సూచిస్తోంది. నామినీని యాడ్ చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో లేదా సభ్యుడు మరణించిన తర్వాత ఆ ఫ్యామిలీ పీఎఫ్, ఇతర సంబంధిత బెనిఫిట్స్ ఈజీగా పొందవచ్చు. అయితే, పీఎఫ్ ఖాతాకు నామినీ లేకుండా ఒకవేళ ఆ సభ్యుడు మరణిస్తే ఆ డబ్బు ఎవరికి వెళ్తుంది? ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పీఎఫ్ ఖాతాలో నామినీ లేకపోతే ఏమవుతుంది?
ఒకవేళ ఈపీఎఫ్ఓ సభ్యుడు తన ఖాతాలో నామినీ పేరు నమోదు చేయకుంటే మరణానంతరం పీఎఫ్ మొత్తం, ఇతర బెనిఫిట్స్ అర్హులైన కుటుంబ సభ్యులు లేదా చట్టపరమైన వారసులు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో అర్హులైన సభ్యులందరూ అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. నిబంధనల ప్రకారమే సమానంగా పీఎఫ్ షేర్ పొందాలి. వ్యాలీడ్ అయ్యే చట్టపరమైన వారసులు ఎవరూ లేనిపక్షంలో చట్టం ప్రకారం తదుపరి అర్హత ఉన్న వ్యక్తి పీఎఫ్ మొత్తాన్ని పొందవచ్చు.
ఖాతాలో నామినీ లేకుంటే ఈ ప్రాసెస్ చాలా కష్టమే. నామినీ ఉంటే డాక్యుమెంటేషన్ పెద్దగా ఉండదు. ఈపీఎఫ్ఓ ప్రకారం.. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉండాలి. నామినీ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే.. సాధారణంగా కొన్ని రోజుల్లోనే క్లెయిమ్ క్లియర్ అవుతుంది.
అదే పీఎఫ్ ఖాతాలో నామినీ లేని సందర్భాల్లో అర్హులైన ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరి ఐడెంటిటీ ప్రూఫ్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఫలితంగా క్లెయిమ్ లాంగ్ ప్రాసెస్ అవ్వడమే కాదు.. పీఎఫ్ పేమెంట్లు కూడా ఆలస్యం అవుతాయి.
