Old EPF Accounts : మీ PF పాత అకౌంట్లు మర్చిపోయారా? EPFO బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే ఆ డబ్బులన్నీ మళ్లీ వస్తాయ్..!
Old EPF Accounts : మీ పాత పీఎఫ్ ఖాతా గుర్తులేదా? అయితే, మీరు ఇలా చేశారంటే మీ పాత ఖాతాలోని డబ్బులన్నీ విత్ డ్రా చేసుకోవచ్చు లేదంటే కొత్త ఖాతాకు ట్రాన్స్ ఫర్ కూడా పెట్టుకోవచ్చు..
- Sreehari A
- Updated on- July 28, 2026 / 03:22 PM IST
Old EPF Accounts
- మీకు పాత పీఎఫ్ ఖాతాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
- కొత్త ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా ఈజీగా ట్రేస్ చేయొచ్చు
- పాత ఖాతాల్లో డబ్బులన్నీ కొత్త ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేయొచ్చు
Old EPF Accounts : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మీ పాత పీఎఫ్ అకౌంట్లు మర్చిపోయారా? డోంట్ వర్రీ.. మీకోసం ఈపీఎఫ్ఓ (EPFO) బంపర్ ఆఫర్ ప్రకటించింది. మీరు ఈ ఒక్క చిన్న పనిచేస్తే చాలు మీ పీఎఫ్ డబ్బులన్నీ బ్యాంకు ఖాతాలోకి తెచ్చుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా చాలామంది ఉద్యోగులు తమ కెరీర్‌లో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఎక్కువగా జాబ్స్ మారుతుంటారు. అలా మారినప్పుడుల్లా వారికి ఒక పీఎఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఆ కంపెనీ వదిలి మరో కంపెనీకి వెళ్లినప్పుడు అక్కడ కూడా కొత్త పీఎఫ్ ఖాతా తెరుస్తారు. ఇలా మారినప్పుడు ప్రతిసారి కొత్త పీఎఫ్ ఖాతా తెరిచి (Old EPF Accounts) అది వాడకుండా అలానే ఉండిపోతుంటాయి. మీ పాత పీఎఫ్ ఖాతాలు కూడా ఇలానే ఉంటే కొన్నాళ్లకు అవి ఇన్ యాక్టివ్ అయిపోతాయి.
ఇలాంటి పీఎఫ్ ఇన్ యాక్టివ్ అకౌంట్లు మిగిలిపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ఒకటి కన్నా ఎక్కువ యూనివర్సల్ అకౌంట్ నంబర్లు (UAN) ఉన్న సభ్యులు కూడా ఎందరో ఉన్నారు. పాత ఖాతాలను ప్రస్తుత UANకు ట్రాన్స్ ఫర్ చేసుకోవడం ఒక్కటే మార్గం. ఒకటి కన్నా ఎక్కువ యూఏఎన్ నంబర్లు ఉన్నా ఒకదానికి మెర్జ్ చేసుకోవడం చేయాలి.
పనిచేయని పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు ఉన్న విషయం కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. దాంతో అందులోని ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ వినియోగంలోకి రావడం లేదు. అయితే, ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రత్యేక డిజిటల్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
పాత ఖాతాలను ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు :
ఇదే విషయాన్ని 2026 జూలై 27న లోక్‌సభలో కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఎంపీ వి.కె. శ్రీకందన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ పోర్టల్ ద్వారా సభ్యులు తమ పాత, ఇన్ యాక్టివ్ పీఎఫ్ ఖాతాలను గుర్తించి అందులోని బ్యాలెన్స్‌ను ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న UANకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని చెప్పారు.
అలాగే వారికి అర్హత ఉంటే సెటిల్‌మెంట్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ పోర్టల్ ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ విధానంపై పనిచేస్తుంది. పీఎఫ్ సభ్యులు ఆధార్ ద్వారా తమ ఐడెంటిటీని కన్ఫార్మ్ చేసుకోవాలి.
ఆ తర్వాతే పాత పీఎఫ్ ఖాతాలను గుర్తించి వాటిని యాక్టివ్ పీఎఫ్ ఖాతాతో లింక్ చేసుకోవచ్చు. తద్వారా ఆఫ్‌లైన్ పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగడం, ఎక్కువ పేపర్‌వర్క్ చేయాల్సిన పని తగ్గుతుందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే వివిధ సంస్థల్లో పనిచేసిన కాలంలో పీఎఫ్ సేవింగ్స్ అన్నింటిని ఒకేచోటకు తీసుకురావొచ్చు. ట్రాన్స్ ఫర్ ప్రాసెస్ మరింత వేగవంతం చేయడమే ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశమని తెలిపింది.
ఆ సభ్యులకు ఇది వర్తించదు :
అయితే, పాత ఈపీఎఫ్ ఖాతా నంబర్లు లేదా సంబంధిత వివరాలు పూర్తిగా మర్చిపోయిన సభ్యులను ఈ సర్వీసులో చేర్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా తమ పాత ఖాతాలను గుర్తించే సభ్యులకే మాత్రమే ఈ సర్వీసు వర్తిస్తుంది.
కొత్త పోర్టల్ ద్వారా ఆధార్ ఆధారిత సేఫ్ వెరిఫకేషన్, ఆన్‌లైన్ పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ అర్హులైన వారికి సెటిల్‌మెంట్ క్లెయిమ్, డిజిటల్ కేవైసీ డిక్లరేషన్లు, తక్కువ పేపర్ వర్క్, ఫాస్ట్ ప్రాసెసింగ్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయని ఈపీఎఫ్ఓ వెల్లడించింది.
