New Aadhaar App : mAadhaar యాప్‌కు గుడ్‌బై.. మీ ఫోన్‌లో కొత్త ఆధార్ యాప్‌ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

New Aadhaar App : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) mAadhaar యాప్‌ను జూన్ 30 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఆధార్ యాప్, ఆధార్ నంబర్ హోల్డర్‌లకు (ANH)కు ఆధార్ సేవలను సురక్షితంగా అందించనుంది.

New Aadhaar App

New Aadhaar App : ఆధార్ వినియోగదారులకు కీలక అప్‌డేట్.. పాత ఎమ్ఆధార్ యాప్‌ను త్వరలో నిలిపివేస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది. ఈ పాత యాప్ స్థానంలో మరింత సేఫ్టీ, ఫాస్ట్ సర్వీసులతో కొత్త ఆధార్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ సపోర్టు, క్యూఆర్ కోడ్ ద్వారా సేఫ్ ఆధార్ షేరింగ్, బయోమెట్రిక్ లాక్, అన్ లాక్, ఆధార్ హిస్టరీ, అప్ డేట్ మేనేజ్ మెంట్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికీ మీరు పాత mAadhaar యాప్‌ను వాడుతుంటే.. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి అధికారిక ఆధార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించింది.

కొత్త ఆధార్ యాప్ ఏంటి? :
ఆధార్ యాప్ అనేది ఆధార్ నంబర్ హోల్డర్‌లకు ఆధార్ సేవలను సురక్షితంగా డిజిటల్ రూపంలో అందిస్తుంది. ఆధార్ నంబర్ హోల్డర్ (ANH) అంటే.. యూఐడీఏఐ ద్వారా ప్రత్యేకమైన 12-అంకెల ఆధార్ నంబర్.

జూన్ 22 నాటికి కొత్త ఆధార్ యాప్ ప్రారంభం కాగా 5 నెలల లోపే 3.1 కోట్ల డౌన్‌లోడ్‌లను అధిగమించింది. దాదాపు 40 లక్షల మంది వినియోగదారులు ఇప్పటికే యాప్ ద్వారా తమ మొబైల్ నంబర్లను అప్‌డేట్ చేసుకున్నారు. సుమారు 8.5 లక్షల మంది వినియోగదారులు తమ అడ్రస్ అప్‌డేట్ కోసం వినియోగిస్తున్నరని పీఐబీ అప్‌డేట్‌లో పేర్కొంది.

కొత్త ఆధార్ యాప్‌లో ముఖ్య ఫీచర్లు ఇవే :

  • మొబైల్ నంబర్ అడ్రస్ అప్‌డేట్
  • ఇ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
  • QR ఆధారిత ఆధార్ వివరాలను ఎంచుకోవడం
  • క్యూఆర్-ఆధారిత డిజిటల్ కాంటాక్ట్ కార్డ్ షేరింగ్
  • ఆధార్ సర్వీసు సెంటర్ల కోసం ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుకింగ్
  • ఆధార్ అప్‌డేట్ రిక్వెస్ట్ ట్రాక్ చేయండి

కొత్త ఆధార్ యాప్‌ డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్ ఎలా? :
ఈ యాప్ ఆండ్రాయిడ్ (వెర్షన్ 9.0 ఆపై వెర్షన్ ) iOS 16 లేదా ఆ తర్వాతి వెర్షన్‌తో రన్ అయ్యే ఆపిల్ ఐఫోన్‌లు రెండింటికీ అందుబాటులో ఉంది . గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వినియోగదారులు సింగిల్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

  • మీకు నచ్చిన లాంగ్వేజీని ఎంచుకోండి.
  • మీ ఆధార్ నంబర్‌ ఎంటర్ చేసి నియమ నిబంధనలు అంగీకరించండి.
  • యాప్‌కు లింక్ చేసిన మొబైల్ సిమ్‌ను ఎంచుకోండి.
  • ఫుల్ ఫేస్ అథెంటికేషన్
  • సేఫ్ లాగిన్ కోసం 6 అంకెల పిన్‌ను సెట్ చేయండి.

మొబైల్ నంబర్‌ అప్‌డేట్ ఎలా? :
ముందుగా యాప్‌లోకి లాగిన్ అయ్యేముందు మీ మొబైల్ నంబర్, ఆధార్‌లో రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్‌ ఒకటేనా కాదా? చెక్ చేసుకోండి. రెండు నంబర్లూ ఒకటే అయితే ఓటీపీతో కొత్త మొబైల్ నంబర్‌ను వెరిఫై చేసుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేసి రుసుము చెల్లిస్తే సరిపోతుంది.

Read Also : Upcoming Cars in July 2026 : కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఆగండి.. జూలైలో వస్తున్న ఈ కార్లు చూసాకే డిసైడ్ అవ్వండి!

ఒకవేళ ఆధార్ యాప్ మరో మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అయితే మాత్రం.. పాత ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్, కొత్త మొబైల్ నంబర్ రెండింటినీ ఓటీపీతో వెరిఫై చేసి ఫేస్ అథెంటికేషన్‌ను పూర్తి చేయండి. రుసుము కూడా చెల్లించండి. లేదంటే మీ సమీపంలోని ఆధార్ సర్వీసు సెంటర్ లేదా అధీకృత ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ వద్దకు వెళ్లాలి. ఆధార్ యాప్ ద్వారా ఫస్ట్ టైమ్ మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేరు.

అడ్రస్ అప్‌డేట్ ఇలా :
ఆధార్ యాప్ ద్వారా వినియోగదారులు వ్యాలీడ్ అయ్యే సపోర్టు డాక్యుమెంట్లతో అడ్రస్ డిజిటల్‌గా అప్‌డేట్ చేసుకోవచ్చు. 6 అంకెల పిన్‌ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సర్వీసులు, అడ్రస్ అప్ డేట్ సెక్షన్‌కు వెళ్లండి. JPG, PNG లేదా PDF ఫార్మాట్‌లో సపోర్టు డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయండి. కొత్త అడ్రస్ ఎంటర్ చేయండి.

ఇంగ్లీష్, లోకల్ భాషలో వెరిఫికేషన్ చేయండి. ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేసి రూ. 75 చెల్లించండి. రిక్వెస్ట్ సమర్పించాక అప్లికేషన్ ట్రాకింగ్ కోసం సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN) ఉన్న అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్ కాకుండా మరో నంబర్‌తో యాప్ రిజిస్టర్ అయితే అడ్రస్ అప్‌డేట్‌ చేసేముందు ఓటీటీ వెరిఫికేషన్ తప్పనిసరి.

సేఫ్‌గా ఎలా షేర్ చేయాలి? :
హోటల్ చెక్-ఇన్‌, హాస్పిటల్ అడ్మిషన్‌, ఎయిర్ పోర్ట్ ఎంట్రీ సమయంలో ఐడెంటిటీ వెరిఫికేషన్, అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ద్వారా గిగ్ వర్కర్లు సర్వీస్ పార్టనర్లను వెరిఫై చేసేందుకు ఆధార్ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఇందులోకి ఒకసారి లాగిన్ అయ్యాక మీరు సర్వీసెస్ షేర్ కాంటాక్ట్ సెక్షన్ వెళ్లండి. అక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.

ఎవరైనా తమ స్మార్ట్‌ఫోన్ కెమెరాతో స్కాన్ చేయాలి. ఆపై వారి పేరు, మొబైల్ నంబర్‌ను ఇన్‌స్టంట్ సేవ్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఆధార్ కార్డు లేకున్నా డిజిటల్‌గా మీ ఐడెంటిటీని వెరిఫై చేయొచ్చు. మీ అంగీకారంతో మాత్రమే మీ ఆధార్ వివరాలు షేర్ అవుతాయి.. మీ ప్రైవసీకి ప్రొటెక్షన్ ఉంటుంది.