OnePlus 13 Price : ఖతర్నాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

OnePlus 13 Price : వన్‌ప్లస్ 13 ధర తగ్గింది.. అమెజాన్ అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ అద్భుతమైన డీల్ సరసమైన ధరకే ఎలా పొందాలంటే?

OnePlus 13 Price : ఖతర్నాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

OnePlus 13 Price

Updated On : July 7, 2025 / 1:35 PM IST

OnePlus 13 Price : వన్‌ప్లస్ అభిమానులకు అదిరే ఆఫర్.. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌ లైనప్‌లో లేటెస్ట్ ఫోన్ వన్‌ప్లస్ 13 ధర భారీగా తగ్గింది. హై ఎండ్ స్పెసిఫికేషన్‌లు, క్లాసీ ఛాసిస్ వంటి (OnePlus 13 Price) అద్భుతమైన కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది. ఇప్పుడు ఈ వన్‌ప్లస్ మోడల్ ధర అమెజాన్‌లో భారీ తగ్గింపు పొందింది.

మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరింత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఇండియాలో భారీ డిస్కౌంట్లతో ఈ వన్‌ప్లస్ 13 ఫోన్‌ అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో పాటు డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 ధర తగ్గింపు :
అమెజాన్ ఇండియాలో వన్‌ప్లస్ 13 అసలు ధర రూ.79,999 నుంచి రూ.76,997కు తగ్గింది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా వినియోగదారులు రూ.2,399 వరకు ఇన్‌స్టంట్ అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

Read Also : PM Kisan Yojana : రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చే తేదీ ఇదేనా? ఖాతాలో రూ. 2వేలు పడతాయా? లేదా? ఫుల్ డిటెయిల్స్..!

ఈ ప్లాట్‌ఫామ్ వివిధ బ్యాంకులపై రూ.1000 తగ్గింపును కూడా అందిస్తోంది. బేసిక్ మిడ్-రేంజ్ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేస్తే.. దాదాపు రూ. 9వేల నుంచి రూ. 11వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మొత్తంగా డిస్కౌంట్ రూ. 12,999 వరకు పొందవచ్చు.

వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13 ఫోన్ 6.82-అంగుళాల LTPO 4.1 అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఆక్సిజన్ OS 15 స్కిన్‌తో రన్ అవుతుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ సెన్సార్, OISతో 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 50MP అల్ట్రా వైడ్-యాంగిల్ షూటర్‌ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ 32MP ఫ్రంట్ స్నాపర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.