PM Kisan Yojana : రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చే తేదీ ఇదేనా? ఖాతాలో రూ. 2వేలు పడతాయా? లేదా? ఫుల్ డిటెయిల్స్..!
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఈ నెల (జూలై) 18న విడుదల అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి.

PM Kisan Yojana
PM Kisan Yojana 20th installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధానమంత్రి కిసాన్ యోజన 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఈసారి జూలై 18న రైతుల (PM Kisan Yojana) ఖాతాలో రూ. 2వేలు పడే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కేవలం అంచనా మాత్రమే. దేశవ్యాప్తంగా లబ్ధిదారు రైతులు 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతులకు వ్యవసాయానికి ఆర్థిక సాయంగా కేంద్ర ప్రభుత్వం నిధులను అందజేస్తోంది.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఈ నిధులను బదిలీ చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులు మాత్రమే ప్రయోజనం పొందగలరు. ప్రతి ఏటా రూ. 6 వేలు అందిస్తుంది. మూడు విడతలుగా రూ. 2వేలు చొప్పున అందిస్తోంది.
ఇప్పటివరకు మొత్తం 19 విడతలుగా ఆర్థిక సాయాన్ని అందించింది. త్వరలో 20వ విడత కూడా విడుదల చేయనుంది. ఇప్పుడు ఈ 20వ విడత జూలై 18న విడుదల చేయొచ్చునని చర్చ జరుగుతోంది. అనుకున్న సమయం కన్నా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
20వ విడత రూ. 2వేలు పడతాయా? :
ఈసారి 20వ విడత ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద విడుదల కానుంది. ఈ విడతలో భాగంగా లబ్ధిదారు ప్రతి రైతుకు రూ. 2వేలు అందనున్నాయి. ప్రతి విడతలో రూ. 2వేలు మాత్రమే అందుతుంది. ప్రతి ఏడాదిలో 3 విడతలుగా ఆర్థిక సాయం అందుతుంది. సంవత్సరానికి మొత్తం రూ. 6వేలు రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ అవుతుంది.
జూలై 18న విడత విడుదల అవుతుందా? :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 18న 20వ విడతను విడుదల చేయవచ్చని అనేక మీడియా నివేదికలు అంచనా వేస్తున్నాయి. అయితే, అలాంటి ప్రకటన ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. వాస్తవానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 18, 2025న బీహార్‌లోని మోతీహరిని సందర్శిస్తారు. నగరంలోని గాంధీ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
ఈ బహిరంగ సభ ద్వారా ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో, 20వ విడత పీఎం కిసాన్ యోజనను డీబీటీ (DBT) ద్వారా కోట్లాది మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. కానీ, పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు విడుదల అవుతుందో లేదో అధికారిక సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 9 వరకు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన స్వదేశానికి వచ్చినప్పుడు మాత్రమే పీఎం కిసాన్ యోజన 20వ విడత విడుదల అవుతుందని గమనించాలి. ప్రతిసారీ ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా పీఎం కిసాన్ రూ. 2వేలు వాయిదా విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ పథకం లబ్ధిదారులతో కూడా సంభాషిస్తారు. పీఎం కిసాన్ 20వ వాయిదా పడాలంటే అందుకు మీరు అర్హులేనా? ఇ-కేవైసీ పూర్తి చేశారా? లబ్ధిదారుల జాబితాలో మీరు ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోండి.