OnePlus Pad 2 : 9510mAh బ్యాటరీతో వన్‌ప్లస్ ప్యాడ్ 2.. అమెజాన్‌లో ఏకంగా రూ.11,000 తగ్గింపు!
OnePlus Pad 2 : మీరు వన్‌ప్లస్ ప్యాడ్ 2ను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 3వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. పూర్తి ఆఫర్లు, ధర వివరాలివే..
- Sreehari A
- Published on- September 28, 2026 / 08:43 PM IST
OnePlus Pad 2
- ఈ టాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ఉంది
- ధర రూ. 31,999 ఉండగా, రూ. 11,000 వరకు తగ్గింపు
- డెబిట్ కార్డ్ ద్వారా రూ. 3వేలు అదనపు డిస్కౌంట్
OnePlus Pad 2 : వన్‌ప్లస్ ప్యాడ్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. వన్‌ప్లస్ ప్యాడ్ 2 తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. పండుగ సీజన్ సందర్భంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
అలాగే, అమెజాన్ సేల్ ప్రారంభానికి ముందే అనేక ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లతో చాలా డీల్స్ రివీల్ అయ్యాయి. వన్‌ప్లస్ ప్యాడ్ 2 కూడా అందులో ఒకటి. ఈ వన్ ప్లస్ టాబ్లెట్‌ను రూ. 10వేల తక్కువకు కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఈ పూర్తి ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వన్‌ప్లస్ ప్యాడ్ 2 అమెజాన్ సేల్ :
అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ నుంచి వన్‌ప్లస్ ప్యాడ్ 2ను చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ ప్యాడ్ 2 రెండు ఏళ్ల క్రితం రూ. 39,999 ధరకు కంపెనీ లేటెస్ట్ టాబ్లెట్‌గా లాంచ్ అయింది. కానీ, ఇప్పుడు, భారీ తగ్గింపుతో లభిస్తోంది.
అమెజాన్ బెస్ట్ డీల్స్‌లో రూ. 31,999 ధరకు లిస్టు అయింది. మీరు ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో వన్‌ప్లస్ ప్యాడ్ 2ను కొనుగోలు చేస్తే.. రూ. 3వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా రూ.11వేల వరకు తక్కువ ధరకే పొందవచ్చు.
వన్‌ప్లస్ ప్యాడ్ 2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ ప్యాడ్ 2లో 144Hz రిఫ్రెష్ రేట్, 303ppi పిక్సెల్ డెన్సిటీ, 88.40 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 12.1-అంగుళాల 3K (2,120×3,000 పిక్సెల్స్) ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ డాల్బీ విజన్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. దీనికి 12GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ అందిస్తుంది.
వన్‌ప్లస్ ప్యాడ్ 2లో 13MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఇందులో క్వాడ్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.4, వై-ఫై 7, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, ఒక USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
ఈ టాబ్లెట్ ఫేస్ రికగ్నిషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో హై-రెస్ సర్టిఫికేషన్‌తో 6-స్పీకర్ల సిస్టమ్ ఉంది. వన్‌ప్లస్ ప్యాడ్ 2లో 9,510mAh బ్యాటరీ ఉంది. 67W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కొలతలు 268.66×195.06×6.49mm, బరువు 584 గ్రాములు ఉంటుంది.
