×
Ad

Oppo Reno 13 Price : ఒప్పో ఫ్యాన్స్‌కు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 13 ధర తగ్గిందోచ్.. ఈ 5G ఫోన్ ఎందుకు కొనాలంటే?

Oppo Reno 13 Price : ఒప్పో కొత్త ఫోన్ కొంటున్నారా? ఒప్పో రెనో 13 ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 13 డీల్ అసలు వదులుకోవద్దు.

1/6
Oppo Reno 13 Price : ఒప్పో అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో సిరీస్ తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రీమియం డిజైన్, కెమెరాలు, మిడ్-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారీగా తగ్గింది. ఈ ఏడాదిలో రూ. 37,999 ధరకు లాంచ్ అయిన ఒప్పో రెనో 13 5G ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో సరసమైనదిగా ధరకే లభిస్తోంది.
2/6
ప్రస్తుత తగ్గింపుతో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ. 30వేల లోపు కొనుగోలు చేయవచ్చు. 1.5K అడాప్టివ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, మల్టీఫేస్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ కలిగి ఉంది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఒప్పో రెనో 13 5G ఫోన్ కొనేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 13 5G ధర : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రెనో 13 5G ఫోన్ రూ.11వేలు డిస్కౌంట్ తర్వాత రూ.26,999కి రిటైల్ అవుతోంది. దాంతోపాటు, కస్టమర్లు ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.4వేలు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. తద్వారా ధర రూ.26వేల కన్నా తగ్గుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మోడల్, కండిషన్‌ బట్టి రూ.20,440 వరకు ట్రేడ్-ఇన్ వాల్యూను అందిస్తుంది.
4/6
ఒప్పో రెనో 13 5G స్పెసిఫికేషన్లు : ఒప్పో రెనో 13 5G ఫోన్ 6.59-అంగుళాల 1.5K అడాప్టివ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, విజువల్స్ కోసం 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. హుడ్ కింద, మీడియాటెక్ డైమన్షిటీ 8350 SoCపై రన్ అవుతుంది. 8GB వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15తో వస్తుంది.
5/6
ఈ ఒప్పో రెనో 5G ఫోన్ 5,600mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. క్విక్ ఛార్జ్ అవుతుంది. IP66, IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది.
6/6
కెమెరాల విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ షూటర్, బ్యాక్ సైడ్ 2MP మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.