×
Ad

Oppo Reno 13 Price : ఇది కదా డిస్కౌంట్.. అమెజాన్‌లో ఒప్పో రెనో 13పై కళ్లుచెదిరే డీల్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ జన్మలో రాదు..!

Oppo Reno 13 Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఒప్పో రెనో 13 ఫోన్ తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ఏకంగా రూ. 13వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/6
Oppo Reno 13 Price : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఆఫర్ మీకోసమే. ఒప్పో రెనో 13 అతి తక్కువ ధరకే లభిస్తోంది. అద్భుతమైన కెమెరాలతో వచ్చిన ఈ ఒప్పో రెనో 13 ఫోన్ అసలు ధర రూ. 37,999 ఉండగా, ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఒప్పో ఫోన్ భారీ ధర తగ్గింపుతో అమ్ముడవుతోంది.
2/6
ఈ ఒప్పో ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz స్మార్ట్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో ఆకట్టుకునే అవకాశం ఉంది. 6.59-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. రూ. 25వేల లోపు ఒప్పో రెనో 13 5G ఫోన్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
అమెజాన్‌లో ఒప్పో రెనో 13 డీల్ : అమెజాన్‌లో ఒప్పో రెనో 13 5G ధర రూ.37,999 నుంచి రూ.13వేలు భారీగా తగ్గింది. ధర కేవలం రూ.24,999కి తగ్గింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.749 అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ వినియోగదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్టంగా రూ.23,500 ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు.
4/6
ఫైనల్ వాల్యూ అనేది మోడల్, డివైజ్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ముందస్తుగా ఫుల్ అమౌంట్ చెల్లించకపోతే కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.1,212 నుంచి ప్రారంభమవుతుంది.
5/6
ఒప్పో రెనో 13 5G స్పెసిఫికేషన్లు : ఒప్పో రెనో 13 ఫోన్ 6.59-అంగుళాల డిస్ప్లేతో 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz స్మార్ట్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. హుడ్ కింద, ఈ ఒప్పో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజ్‌ కూడా ప్యాక్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ColorOS 15పై రన్ అవుతుంది.
6/6
ఒప్పో రెనో 13లో 5,600mAh బ్యాటరీ ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ IP66, IP68, IP69 సర్టిఫికేషన్లతో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఒప్పో రెనో 13 5Gలో 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.