Free TV Channels : బిగ్ బ్రేకింగ్ : కొత్త TRAI రూల్స్ షాక్… 13 కోట్ల మందికి ఫ్రీ టీవీ ఛానెల్స్ బంద్.. ఎప్పటినుంచంటే?
Free TV Channels : మీరు ఇకపై LG, Samsung Xiaomi స్మార్ట్ టీవీలలో టీవీ ఛానెల్స్ ఫ్రీగా చూడలేరు.. కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఈ కంపెనీల స్మార్ట్ టీవీలలో ఇంటర్నెట్ ద్వారా 150కి పైగా టీవీ ఛానెళ్లను ఫ్రీగా చూస్తున్నారు.
- Sreehari A
- Published On : April 10, 2026 / 04:49 PM IST
Free TV Channels
- స్మార్ట్ టీవీలో ఇంటర్నెట్ ద్వారా 150కి పైగా టీవీ ఛానెళ్లు ఉచితం
- మే 4 నాటికి ఉచిత స్మార్ట్ టీవీ ఛానెళ్లపై ట్రాయ్ నిర్ణయం తీసుకోనుంది
- అధికారిక పర్యవేక్షణలోకి తీసుకురావడానికి ట్రాయ్ సన్నాహాలు
- లక్షలాది మంది ప్రముఖ ఛానెల్‌లకు ఫ్రీ యాక్సస్ కోల్పోవచ్చు
- కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లు సమాన అవకాశాల కోసం ఒత్తిడి
Free TV Channels : స్మార్ట్ టీవీ ఎక్కువగా చూస్తుంటారా? అయితే మీకో బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఇకపై మీరు స్మార్ట్ టీవీలలో ఫ్రీగా ఛానల్స్ చూడలేరు. అతి త్వరలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా LG, Samsung, Xiaomi స్మార్ట్ టీవీలలో టీవీ ఛానెల్‌లను ఉచితంగా చూడలేరు.
ఫ్రీ లీనియర్ ఛానెళ్లను అందించే స్మార్ట్ టీవీ యాప్‌ల ద్వారా ఫ్రీ ఛానల్స్ యాక్సస్ చేయలేరు. కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్ల మాదిరిగానే అదే రూల్స్ పాటించాలా వద్దా అనేదానిపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 2026 మే 4వ తేదీలోగా నిర్ణయం తీసుకోనుంది.
ప్రస్తుతం ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ రుసుము లేకుండా 150కి పైగా ఛానెళ్లను 12.9 కోట్ల మందికి పైగా స్మార్ట్ టీవీ వినియోగదారులు చూస్తున్నారు. నియంత్రణలోని లోపాలు, ఫ్రీ యాడ్-సపోర్టెడ్ స్ట్రీమింగ్ టెలివిజన్ (ఫాస్ట్) ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో ట్రాయ్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.
మే 4 నాటికి ఫ్రీ స్మార్ట్ టీవీ ఛానెళ్లపై ట్రాయ్ నిర్ణయం :
ఫ్రీ లీనియర్ ఛానెళ్లను అందించే స్మార్ట్ టీవీ యాప్‌లను కేబుల్, డీటీహెచ్ సర్వీసుల మాదిరిగా నియంత్రించాలా వద్దా అనే విషయంపై ట్రాయ్ (TRAI) పరిశీలిస్తోంది. 2026 మే 4న ఈ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం లక్షలాది మంది ఫ్రీగా ఛానల్స్ చూస్తున్నారు. ఇకపై డబ్బులు కట్టి మరి ఛానల్స్ చూడాల్సి రావొచ్చు.
ఫ్రీ ఛానెల్ ఆప్షన్ ఇక ఉండదు :
ప్రస్తుతం, భారత మార్కెట్లో 129 మిలియన్లకు పైగా స్మార్ట్ టీవీ యూజర్లు కేవలం ఇంటర్నెట్ కనెక్షన్‌లు, ప్రీ ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లపై ఆధారపడి సబ్‌స్క్రిప్షన్ ఫీజులు చెల్లించకుండా 150కి పైగా ఛానెల్‌లను యాక్సెస్ చేస్తున్నారు.
ఒకవేళ ట్రాయ్ (TRAI) డీటీహెచ్ (DTH) వంటి నిబంధనలను తప్పనిసరి చేస్తే ఈ ఛానెల్‌లు కూడా పేవాల్స్ పరిధిలోకి వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా ఎక్కువగా ఓటీటీ (OTT) వాడే యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, ఫ్రీ ఛానెల్‌లపై ఆధారపడే సాధారణ వీక్షకులు మాత్రం భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది.
కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్ల ఒత్తిడి :
సాంప్రదాయ పే టీవీ ఆపరేటర్ల వాదన విషయానికి వస్తే.. ఫాస్ట్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రోగ్రామ్, అడ్వర్టైజింగ్ కోడ్‌లు, డౌన్‌లింకింగ్ మార్గదర్శకాలను తప్పించుకుంటూ లైసెన్సులు లేకుండా టెలివిజన్ ఛానెళ్లను పంపిణీ చేస్తాయి. కేబుల్, డీటీహెచ్ ప్రొవైడర్లు రుసుములు చెల్లించి కఠినమైన నిబంధనలను పాటిస్తున్నారు. ఫాస్ట్ సర్వీసులు మాత్రం ఎలాంటి మానిటరింగ్ లేకుండా పనిచేస్తాయి.
ఫాస్ట్ సర్వీసులతో స్మార్ట్ టీవీ మార్కెట్ భారీగా నష్టోపోగా స్మార్ట్ టీవీలలో ప్రీలోడ్ లేదా యాప్‌లో ఉండే ఫాస్ట్ (FAST) ప్లాట్‌ఫారమ్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లకు బదులుగా యాడ్స్ ద్వారా ఫండ్స్ పొందుతూ లీనియర్ టీవీ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నాయి.
