Paytm ITR Filing : టాక్స్ పేయర్లకు పండగే.. ఇక పేటీఎంలో జస్ట్ రూ. 11కే ITR ఫైల్ చేయొచ్చు.. ఫుల్ ప్రాసెస్ మీకోసం..!
Paytm ITR Filing : పేటీఎం, క్లియర్ టాక్సు భాగస్వామ్యంతో కేవలం రూ. 11 నుంచే ఐటీఆర్ ఫైలింగ్ సర్వీసులను ప్రారంభించింది. తద్వారా వినియోగదారులు తమ ఇంటినుంచే సౌకర్యవంతంగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేసుకోవచ్చు.
Paytm ITR Filing
- పేటీఎంలో క్లియర్ టాక్సుతో రూ.11కే ఐటీఆర్ ఫైల్ చేయండి.
- ముందుగా నింపిన డేటా, ఆటోమేటిక్ ఫారం ఆప్షన్
- ఫ్రీ నోటీసు ప్రొటెక్షన్ క్యాపిటల్ గెయిన్స్ గణన పొందవచ్చు
Paytm ITR Filing : టాక్స్ పేయర్లకు భారీ గుడ్ న్యూస్.. మీరు ఇంకా మీ ఐటీఆర్ దాఖలు చేయలేదా? అయితే, ఇది మీకోసమే.. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం ఇప్పుడు పన్ను ఫైలింగ్ ప్లాట్‌ఫామ్ (ClearTax)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తద్వారా టాక్స్ పేయర్లు కేవలం రూ. 11 నుంచే పేటీఎం యాప్ ద్వారా నేరుగా తమ ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ (Paytm ITR Filing) పన్ను రిటర్న్ దాఖలు ప్రక్రియను మరింత ఈజీగా ఎలాంటి అవాంతరాలు లేకుండా అందిస్తుంది.
పన్ను రిటర్న్ దాఖలుకు చివరి గడువు జూలై 31, 2026. మీ ఐటీఆర్ దాఖలు చేసేముందు సీఏ, ఏజెంట్ అధిక ఫీజులను తగ్గించుకోవచ్చు. పేటీఎం, క్లియర్టాక్స్తో భాగస్వామ్యంతో సరికొత్త ఐటీఆర్ ఫైలింగ్ సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసు కింద వినియోగదారులు కేవలం రూ.11 నుంచే తమ ఐటీఆర్ దాఖలు చేయవచ్చు.
కొత్త సర్వీసు ఏంటి? :
పేటీఎం యాప్ ద్వారా వినియోగదారులు ఇప్పుడు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలుకు క్లియర్ టాక్స్ ప్లాట్‌ఫారమ్‌ను నేరుగా యాక్సెస్ చేయొచ్చు. ఈ మొత్తం ప్రక్రియను ఈజీగా చేసేందుకు, పన్నులు దాఖలుకు పట్టే సమయం, పొరపాట్ల అవకాశాన్ని తగ్గించేందుకు అనేక ఆటోమేటెడ్ ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది.
ఈ సర్వీసులో స్పెషాలిటీ ఏంటి? :
1. ఈ సర్వీసులో బెస్ట్ విషయం ఏమిటంటే.. మీ వివరాలన్నింటినీ చేతితో నింపాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాట్‌ఫారమ్ మీరు ముందుగా ఫిల్ చేసిన డేటా మొత్తాన్ని నేరుగా ఆదాయపు పన్ను శాఖ రికార్డుల నుంచి ఆటోమాటిక్‌గా తీసుకుంటుంది.
2. చాలా మందికి ITR-1 లేదా ITR-2లలో ఏది తమకు సరైనదో లేదా పాత లేదా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలో అర్థం కాదు. ఈ స్మార్ట్ సిస్టమ్ మీ ఆదాయం ఆధారంగా సరైన ఫారమ్‌ను అత్యంత ప్రయోజనకరమైన విధానాన్ని ఆటోమాటిక్‌గా సెలెక్ట్ చేసి పెడుతుంది.
3. మీరు స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే.. ఈ సర్వీసు కేవలం ఒక్క క్లిక్‌తో 80కిపైగా బ్రోకరేజ్ యాప్‌ల (జెరోధా, గ్రోవ్, అప్‌స్టాక్స్) నుంచి మీ ట్రేడింగ్ డేటాను సేకరిస్తుంది. తద్వారా క్యాపిటల్ గెయిన్స్ ఆటోమాటిక్‌గా లెక్కిస్తుంది.
Read Also : NEET-Supreme Court : నీట్ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అరెస్టైన విద్యార్థులకు భారీ ఊరట!
4. ఈ ఆఫర్లో ఇదే బెస్ట్. కేవలం రూ. 11కే ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఫ్రీ నోటీసు ప్రొటెక్షన్ కూడా ఉంది. అంటే.. మీ ఐటీఆర్ ఫైల్ చేశాక ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు అందుకుంటే క్లియర్ టాక్స్ నిపుణులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా మీకు అసిస్టెన్స్ అందిస్తారు.
బెనిఫిట్స్ ఎలా పొందాలంటే? :
- మీ స్మార్ట్‌ఫోన్‌లో Paytm యాప్‌ను ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలోని ‘Free Tools’ సెక్షన్‌కు స్క్రోల్ చేయండి.
- మీకు ‘క్లియర్టాక్స్తో మీ ITRను ఫైల్ చేయండి’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆపై ట్యాప్ చేయండి.
- మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి.
- మీ ఈమెయిల్‌కు వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. ఆపై ఎంటర్ చేసి లాగిన్ చేయండి.
- మీ ఆదాయపు పన్ను శాఖ వివరాలు (జీతం, TDS, FD వడ్డీ) స్క్రీన్‌పై కనిపిస్తాయి
- అన్ని ఒకసారి చెక్ చేసుకుని రిటర్న్‌ను సబ్మిట్ చేయండి.
టాక్స్ కట్టేటప్పుడు జాగ్రత్త :
రూ. 11 ప్రారంభ ధర ప్రతి పన్నుచెల్లింపుదారు లేదా ప్రతి కేటగిరీ ఐటీఆర్ ఫారంకు తప్పనిసరిగా వర్తించదు. మీ ఐటీఆర్ టైప్, ఆదాయ వనరు, పన్ను ప్రొఫైల్‌ను బట్టి ఛార్జీలు మారవచ్చు. అందుకే మీ ఫైలింగ్ దాఖలుకు ముందు ప్లాన్ నిబంధనలు, ఫీజులను జాగ్రత్తగా చెక్ చేసుకోవడం బెటర్.
