Pension Alert 2026 : పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 30లోపు ఇదొక్కటి చేయండి.. లేదంటే పెన్షన్ పోయినట్టే..!
Pension Alert : పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 30లోపు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. ఆన్‌లైన్, ఆధార్ ఫేస్ అథెంటికేషన్, పోస్టాఫీస్ ద్వారా ఎలా సమర్పించాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- October 19, 2026 / 08:20 PM IST
Jeevan Pramaan Life Certificate
- పెన్షన్ ఆగకుండా ఉండాలంటే ఇది మర్చిపోవద్దు..
- 80 ఏళ్లు దాటిన పెన్షనర్లకు ప్రత్యేక అవకాశం.. గడువు ఎప్పుడంటే?
- జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలి?
Pension Alert 2026 : ప్రతి నెలా పెన్షన్‌పై ఆధారపడే వారికి కీలక అలర్ట్.. పెన్షన్ సజావుగా అందాలంటే ప్రతి ఏడాది సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ పత్రం) విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.
నవంబర్ 30వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే పెన్షన్ చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉంది. అందుకే, చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే సర్టిఫికేట్ సమర్పించడం ఎంతైనా మంచిది.
లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు ముఖ్యం? :
పెన్షన్ పొందుతున్న వ్యక్తి జీవించి ఉన్నారని వెరిఫై చేసేందుకు ఈ సర్టిఫికేట్ అవసరం. అర్హులైన పెన్షనర్లకు పేమెంట్లను కొనసాగించేందుకు సంబంధిత పెన్షన్ పంపిణీ సంస్థలు ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుంటాయి. సాధారణంగా ప్రతి ఏడాది నవంబర్ 1 నుంచి 30 వరకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. అయితే, 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు అక్టోబర్ 1 నుంచే సమర్పించవచ్చు.
ఇంట్లోనే కూర్చొని సబ్మిట్ చేయొచ్చు :
లైఫ్ సర్టిఫికేట్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. డిజిటల్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్ ద్వారా జీవన్ ప్రమాణ్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ సాయంతో ఫేస్ అథెంటికేషన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఇందుకు అవసరమైన యాప్‌లు, ఆధార్ వివరాలు, మొబైల్ నంబర్ రెడీగా దగ్గర పెట్టుకోవాలి.
ఆన్‌లైన్ విధానం అందుబాటులో లేనివారు బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు, సంబంధిత ప్రభుత్వ కేంద్రాల ద్వారా కూడా సర్టిఫికేట్ సమర్పించవచ్చు. పోస్టాఫీస్ ద్వారా డోర్‌స్టెప్ సర్వీసును కోరవచ్చు. ఈ సర్వీసుకు వర్తించే ఛార్జీలు, విధానాలను ముందుగా తెలుసుకోవడం బెటర్..
పెన్షనర్లు తప్పక గుర్తించుకోండి :
సర్టిఫికేట్ సమర్పించేటప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO), ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పెన్షన్ ఖాతా వివరాలు రెడీగా ఉంచుకోండి. సమర్పించిన తర్వాత వెరిఫికేషన్ పూర్తయిందో లేదో కూడా చెక్ చేసుకోండి.
గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకుంటే పెన్షన్ ఆలస్యం కావచ్చు లేదంటే తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. అయితే, కచ్చితమైన గడువు, నిబంధనలు పెన్షన్ పథకం, సంబంధిత సంస్థ ఆధారంగా మారవచ్చు. మీ పెన్షన్ అందించే బ్యాంకు లేదా సంబంధిత ఆఫీసు సూచనలను తప్పనిసరిగా పాటించండి.
