Petrol Diesel Price Hike : పెట్రో బాంబ్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర.. లీటర్ మీద ఎంత పెరిగిందంటే..

Petrol Diesel Price Hike : సామాన్యులకి మరో సారి పెట్రో షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి.

Petrol diesel prices hiked for second time in a week 90 paise per liter

  • సామాన్యులకు భారీ షాక్
  • మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
  • లీటర్ మీద 90 పైసల పెంపు

Petrol Diesel Price Hike : సామాన్యులకు కేంద్రం మరోసారి భారీ షాకిచ్చింది. తాజాగా మంగళవారం నాడు మరోసారి ఇంధన ధరలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు కంపెనీలు సోమవారం రిటైల్ ధరలను సవరించడంతో.. వారం రోజుల వ్యవధిలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలకు తగ్గట్టుగానే దేశీయంగా ఈ ధరలను పెంచినట్లు ఇంధన కంపెనీలు చెబుతున్నాయి.

ఈ తాజా పెంపుతో వాహనదారులపై అదనపు భారం పడనుంది. తాజాగా ఇంధన కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 90 పైసల చొప్పున పెంచాయి.
తాజాగా పెరిగిన ధరల తర్వాత.. ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు పెరిగి, రూ.97.77 నుండి రూ.98.64 కి చేరుకుంది. అదేవిధంగా డీజిల్ ధర కూడా లీటరుకు 91 పైసలు పెరగడంతో, గతంలో డీజిల్ లీటర్ ధర రూ.90.67 ఉండగా.. ఇప్పుడు రూ.91.58 కి చేరింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇంధన ధరలు పెరిగాయి.

*వావ్! అద్భుతమైన ఫోన్.. ఐక్యూ Z11 లైట్ 5G వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్!

గ్లోబల్ క్రూడాయిల్ (అంతర్జాతీయ ముడి చమురు) ధరలు పెరగడం వల్ల సంభవించిన నష్టాలను కొంతవరకు భర్తీ చేయడానికి, ప్రభుత్వం గత శుక్రవారం నాలుగేళ్లలో మొదటిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 3 చొప్పున పెంచింది. అయితే వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ రేట్లను పెంచడం గమనార్హం. ఇప్పటికే రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి వినియోగదారులపై ఈ తాజా ధరల సవరణ మరింత అదనపు భారాన్ని మోపినట్లయింది.

* మరో బాదుడు తప్పదా..! పెరగనున్న వంట నూనెల ధరలు..?

మెట్రో నగరాల్లో కోల్‌కతాలోనే పెట్రోల్ ధరలు అత్యధికంగా పెరిగాయి. అక్కడ లీటర్ పెట్రోల్‌పై 96 పైసలు పెరగడంతో దాని ధర రూ. 109.70 కి చేరింది. అలాగే డీజిల్ ధర 94 పైసలు పెరిగి, ప్రస్తుతం లీటర్ రూ. 96.07 కి లభ్యమవుతోంది. చెన్నైలో పెట్రోల్ ధరలు 82 పైసలు పెరిగి లీటరుకు రూ. 104.49 కి చేరగా.. డీజిల్ ధర లీటర్ మీద 86 పైసలు పెరిగి లీటరుకు రూ. 96.11 కి చేరుకుంది. పెరిగిన ధరలతో సామాన్యుల జేబుకు చిల్లు పడనుంది.