PF Balance Check : ఇంటర్నెట్‌తో పనిలేదు భయ్యా.. మీ PF ఖాతాలో బ్యాలెన్స్ ఇలా ఈజీగా చెక్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ స్టెప్స్

PF Balance Check : పీఎఫ్ బ్యాలెన్స్ ఇంటర్నెట్ లేకుండా చెక్ చేయొచ్చు తెలుసా? ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా నిమిషాల్లోనే మీ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే?

PF Balance Check

  • ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్
  • మీ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసా?
  • ఇంటర్నెట్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ ఈజీగా తెలుసుకోవచ్చు

PF Balance Check : పీఎఫ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. మీకు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం తెలుసా? ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) కింద నెలసరి జీతంలో కొంత అమౌంట్ డిపాజిట్ అవుతుంది. రిటైర్మెంట్ తర్వాత లేదా ఉద్యోగం పోయినప్పుడు ఈ మొత్తాన్ని తీసుకోవచ్చు.

మీ జీతం నుంచి ప్రతినెలా పీఎఫ్ అమౌంట్ డిపాజిట్ అవుతుంటుంది. పీఎఫ్ బ్యాలెన్స్‌ క్రమం తప్పకుండా చెక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా కేవలం కొన్ని నిమిషాల్లో మీ ఫోన్‌లోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఇందుకు పీఎఫ్ అకౌంట్ లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేద్దాం..

ఇంటర్నెట్ లేకుండా పీఎఫ్ బ్యాలెన్స్‌ చెకింగ్ ఎలా? :
ఆన్‌లైన్‌ లేకున్నా మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేయొచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి SMS పంపాలి. ఈ సర్వీసు కోసం మీ నంబర్ మీ UANకు లింక్ చేసి ఉండాలి. మెసేజ్ ఫార్మాట్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. లేదంటే.. మీరు SMS ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేయలేరు.

Read Also : Maruti Ignis : మారుతి బుల్లి కారు ఇగ్నిస్‌కు గుడ్‌బై.. కొత్త మైక్రో SUV వచ్చేస్తోంది.. టాటా పంచ్‌కు గట్టి పోటీ..!

SMS ఎలా పంపాలంటే? :
ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసేందుకు 7738299899 నంబర్‌కు SMS పంపండి. మీ మెసేజింగ్ యాప్‌లో ‘EPFOHO UAN ENG’ ఫార్మాట్‌లో మెసేజ్ టైప్ చేయండి. మీరు ‘ENG’ స్థానంలో మీరు ఎంచుకున్న లాంగ్వేజీ ఫస్ట్ 3 అక్షరాలను ఉపయోగించవచ్చు. ఆ తర్వాత SMS పంపండి. మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను మీ మొబైల్ ఫోన్‌కు వస్తాయి.

మిస్డ్ కాల్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు :
మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే మిస్డ్ కాల్ చేయడం ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు కాల్ చేయండి. కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. త్వరలోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ సంబంధిత సమాచారంతో మీకు SMS వస్తుంది.

ఈపీఎఫ్ఓ ​​ఇప్పుడు పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలను భారీగా సవరించింది. ఇకపై ఉద్యోగులు నిరుద్యోగులైన సందర్భంలో అవసరమైతే తమ పీఎఫ్ ఖాతాలో డిపాజిట్ అయిన డబ్బును ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ ఫండ్స్ విత్ డ్రా ప్రక్రియను ఈపీఎఫ్ఓ మొత్తం 3 ప్రధాన కేటగిరీలుగా విభజించింది. ఈ మూడింటిలో నుంచి ఏది కావాలో అది ఎంచుకుంటే సరిపోతుంది.

  • అత్యవసర అవసరాలు,
  • గృహ అవసరాలు,
  • ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోవడం లేదా నిరుద్యోగం ఈ కేటగిరీలోకి వస్తాయి.