PF withdrawal : PF డబ్బులు కావాలా? ఫస్ట్ మీ EPFO ​​ఖాతాలో ఈ డిటైల్స్ చెక్ చేసుకోండి.. లేదంటే పైసా కూడా రాదు..!

PF withdrawal : సర్వీసు హిస్టరీ, కేవైసీ వివరాలు నామినేషన్లలోని తప్పులు ముందుగా గుర్తించకపోవచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో కొన్ని వివరాలను చెక్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ ట్రాన్స్ ఫర్ పరంగా ఇబ్బందులు ఉండవు.

PF withdrawal

  • పీఎఫ్ ఖాతాలో వివరాలు సరిగా ఉన్నాయో చెక్ చేశారా?
  • చిన్న పొరపాట్లతో కూడా మీ పీఎఫ్ డబ్బులు ఆలస్యం కావొచ్చు
  • UAN సహా ఇతర పీఎఫ్ ఖాతాలో వివరాలు అప్ డేట్ చేసుకోండి

PF withdrawal : ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే, పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేయాలని అనుకుంటున్నారా? ముందుగా మీ పీఎఫ్ ఖాతాలో కొన్ని విషయాలను చెక్ చేసుకోండి. ఆ తర్వాతే పీఎఫ్ ఖాతాలో డబ్బులను తీసుకోగలరు. ఎందుకంటే.. మీకు తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. పీఎఫ్ ఖాతాలో సమస్యల గురించి ముందుగా తెలియకపోవచ్చు.

చాలామందికి జాబ్ మారినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పీఎఫ్ ఖాతాలో సమస్యలు (PF withdrawal) బయటపడతాయి. అందుకే మీకు ఇలాంటి సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే ముందుగానే మీ పీఎఫ్ ఖాతాలో అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

జాబ్ రికార్డులు, కేవైసీ వివరాలు, నామినేషన్లు, అకౌంట్ లింకింగ్ వంటి విషయాల్లో వివరాలు తప్పుగా ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ ఆలస్యమవుతుంది. ఇంతకీ పీఎఫ్ సభ్యులు ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మీ సర్వీస్ హిస్టరీని చెక్ చేయండి :
గతంలో జాబ్స్ మారిన ఉద్యోగులు ఈపీఎఫ్ ​​పోర్టల్‌లోని సర్వీసు హిస్టరీ సెక్షన్ చెక్ చేసుకోవాలి.. ఈ రికార్డు, సభ్యుని యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)కు లింక్ అయిన అన్ని సంస్థలు, జాయినింగ్, ఎగ్జిట్ వంటి తేదీలతో చూపిస్తుంది. ఉద్యోగ రికార్డులు, రాంగ్ తేదీలు లేదా యూఏఎన్ సరిగ్గా లింక్ చేయని పీఎఫ్ ఖాతాలను గుర్తించవచ్చు. అలానే వదిలేస్తే అకౌంట్ బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్, విత్ డ్రా, పెన్షన్ సంబంధిత క్లెయిమ్‌ల సమయంలో ఇబ్బందులు తప్పవు.

పీఎఫ్ బ్యాలెన్స్‌, కాంట్రిబ్యూషన్ చెక్ చేయండి :
పీఎఫ్ సభ్యులు మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌ చూస్తారు. కానీ, ప్రతి నెలా తమ కాంట్రిబ్యూషన్లు సరిగ్గా డిపాజిట్ అవుతున్నాయో లేదో పెద్దగా పట్టించుకోరు. ఈపీఎఫ్ఓ ​​పాస్‌బుక్‌లో నెలవారీ ఉద్యోగి, యజమాని కాంట్రిబ్యూషన్ల రికార్డు చూడొచ్చు.

నామినీ వివరాలు అప్‌డేట్ :
ఉద్యోగులు జాబ్ జాయినింగ్ సమయంలో నామినేషన్ ప్రాసెస్ పూర్తి చేసి ఆపై మళ్లీ చెక్ చేయరు. ఇ-నామినేషన్ ద్వారా సభ్యులు తమ నామినీ వివరాలను ఆన్‌లైన్‌లో యాడ్ చేసుకోవచ్చు లేదా అప్ డేట్ చేయొచ్చు. వివాహం తర్వాత భార్యాపిల్లల వంటి వివరాలను కూడా ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. నామినేషన్ వివరాలు సరిగా లేకుంటే భవిష్యత్తులో వారికి సెటిల్‌మెంట్ ప్రాసెస్ కాదు.

Read Also : Tuni Girl Missing Case : చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై అసత్య ప్రచారం ఆపండి.. హోం మంత్రి అనిత హెచ్చరిక

కేవైసీ వివరాలను వెరిఫై చేయండి :
పీఎఫ్ సంబంధిత లావాదేవీలలో జాప్యానికి కేవైసీ సంబంధిత సమస్యలు కూడా కారణమే. ఉద్యోగులు తమ ఆధార్, పాన్ బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా లింక్ చేసుకుని ఉండాలి. ఖాతా బదిలీ లేదా విత్ డ్రా రిక్వెస్ట్ లేదా ఇన్ యాక్టివ్ బ్యాంకు అకౌంట్, తప్పుడు ఖాతా సమాచారం లేదా కేవైసీ రికార్డు పూర్తి కాకపోవడం వంటివి సమస్యగా మారవచ్చు.

ప్రొఫైల్ మ్యాచ్ ఇష్యూ ముందే ఫిక్స్ చేయండి :
ఈపీఎఫ్ఓ రికార్డులకు, అధికారిక ఐడెంటిటీ డాక్యుమెంట్ల మధ్య ఏమైనా తేడాలు ఉంటే క్లెయిమ్ దాఖలు సమయంలో తెలుస్తుంది. పీఎఫ్ సభ్యులు తమ పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వ్యక్తిగత వివరాలను రివ్యూ చేసుకోవాలి. అవసరమైన చోట మార్పులు చేయాలి. ఇలాంటి తేడాలను ముందుగానే ఫిక్స్ చేస్తే భవిష్యత్తులో పీఎఫ్ డబ్బులను పొందడంలో ఆలస్యం ఉండదు.

జాబ్ మారితే పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ట్రాక్ చేయండి :
ఉద్యోగం మారినంత మాత్రాన గత కంపెనీల నుంచి పీఎఫ్ బ్యాలెన్స్‌ ఆటో ట్రాన్స్ ఫర్ చేయలేరు. ట్రాన్స్ ఫర్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాతే ఉద్యోగులు ఈపీఎఫ్ ​​పోర్టల్ ద్వారా తమ స్టేటస్ ట్రాక్ చేసుకోవాలి. గత జాబ్ నుంచి బ్యాలెన్స్‌లు సరిగ్గా ట్రాన్స్‌ఫర్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకటి కన్నా ఎక్కువ ఇన్ యాక్టివ్ పీఎఫ్ అకౌంట్లు ఉంటే ఫ్యూచర్ అకౌంట్ మేనేజ్ మరింత కష్టంగా మారుతుంది.

గ్రీవెన్స్ పోర్టల్‌ను వాడండి :
పీఎఫ్ ఖాతాకు సంబంధించి అన్ని సమస్యలకూ ఈపీఎఫ్ఓ ​​ఆఫీసుకు వెళ్లక్కర్లేదు. ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ క్లెయిమ్‌ల ఆలస్యం, ట్రాన్స్ ఫర్ సమస్యలు, తప్పుడు రికార్డులు, ఇతర ఖాతా సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు చేయొచ్చు. అంతేకాదు.. ఫిర్యాదుల స్టేటస్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు.

UAN వివరాలు అప్‌డేట్‌ చేయండి :
ఈపీఎఫ్ఓ ​​సేవలను పొందాలంటే UAN వివరాలు ఎప్పుడూ అప్ డేట్ ఉంచుకోవాలి. ఉద్యోగులు తమ మొబైల్ నంబర్ యూఏఎన్ లింక్ చేసి ఉండాలి. పీఎఫ్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేశారో లేదో చెక్ చేయాలి. మీ ఖాతా యాక్టివ్ ఉంటేనే యూఏఎన్, పాస్‌బుక్ డౌన్‌లోడ్‌లు, క్లెయిమ్ ట్రాకింగ్, ప్రొఫైల్ అప్‌డేట్‌లు, అకౌంట్ మేనేజ్ వంటి ఆన్‌లైన్ సర్వీసులను ఈజీగా యాక్సస్ చేయగలరు.

చాలా మంది ఉద్యోగులకు ఫండ్స్ ట్రాన్స్ ఫర్, జాబ్ మారడం లేదా విత్ డ్రా క్లెయిమ్‌ను సమయంలోనే ఈపీఎఫ్ఓ సంబంధిత సమస్యలు కనిపించవు. ఏ కొంచెం తప్పు ఉన్నా మీ క్లెయిమ్ ప్రాసెస్ ముందుకు వెళ్లదు. ప్రతి ఏడాదిలో తప్పనిసరిగా సర్వీస్ హిస్టరీ, నామినేషన్లు, కేవైసీ రికార్డులు కాంట్రిబ్యూషన్ వివరాలను చెక్ చేయండి. తద్వారా రిటైర్మెంట్ సేవింగ్ యాక్సెస్ విషయంలో ఇబ్బందులు ఉండవు.