×
Ad

AC Buying Guide : సమ్మర్‌లో కొత్త AC కొనేముందు జాగ్రత్త, ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు.. 90% మంది ఇదే చేస్తారు!

AC Buying Guide : కొత్త ఏసీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. ఏసీ కొనే ముందు 90 శాతం మంది ఈ మిస్టేక్స్ ఎక్కువగా చేస్తుంటారు.. అవేంటో ఓసారి లుక్కేయండి.

AC Buying Guide

  • 2026 మార్కెట్లో ప్రస్తుతం లభ్యమయ్యే 5 బెస్ట్ సెల్లింప్ ఏసీలు
  • కొత్త ఏసీ కొనేముందు అందరూ చేసే కామన్స్ మిస్టేక్స్ ఇవే
  • గదిలో ఏసీ సరైనది కొనకపోతే ఈ కింది సమస్యలు రావచ్చు

AC Buying Guide : వేసవి వచ్చేస్తోంది. ఏసీలు, కూలర్లు కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఎండలు ముదరకముందే కొత్త ఏసీ, కూలర్లు ఇంటికి తెచ్చుకోండి. ఇప్పుడు అయితే తక్కువ ధరకే లభిస్తాయి. ఏప్రిల్ వస్తే ఏసీల ధరలు ఎక్కువగా పెరగొచ్చు. అయితే, చాలామంది ఏసీలు కొనేముందు కొన్ని తప్పులు చేస్తుంటారు.

అందుకే మార్కెట్లో ఆఫర్లు, డిస్కౌంట్లు చూసి టెంప్ట్ అయి ఏసీలు కొనొద్దు. ప్రస్తుతం మార్కెట్లో వోల్టాస్, హిటాచీ, ఎల్‌జీ, శాంసంగ్ వంటి బ్రాండ్లు వైడ్ రేంజ్ ఏసీలను అందిస్తున్నాయి. కొత్త ఏసీ కొనేవారు తొందరలో రాంగ్ మోడల్‌ను ఎంచుకుంటారు. దీని కారణంగా ఇంట్లో అసౌకర్యంతో పాటు పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈఎంఐ లోన్‌తో కొత్త ఏసీని కొనుగోలు చేయొచ్చు.
కొత్త ఏసీ కొనడం వల్ల మీ బడ్జెట్‌పై భారం పడదు. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈజీ ఈఎంఐ లోన్‌తో రూ. 5 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. అనేక ఏసీ మోడళ్లపై జీరో డౌన్ పేమెంట్‌తో అందుబాటులో ఉన్నాయి. అప్‌గ్రేడ్‌లు ఆప్షన్లు కూడా పొందవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ సమ్మర్ సేల్ సమయంలో అనేక కొత్త రేంజ్ ఏసీలు ఆకర్షణీయమైన ధరలకు లభిస్తాయి.

రాంగ్ ఏసీతో అసౌకర్యం, బిల్లుల భారం :
సరైన స్పెషిఫికేషన్లు చెక్ చేయకుండా ఏసీ కొనడం వల్ల ఈ కింది సమస్యలు రావచ్చు.

  • అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులు
  • కూలింగ్ సరిగా అవ్వకపోవడం
  • తరచుగా ఏసీ బ్రేక్‌డౌన్‌లు

కొత్త ఏసీ కొనేవారు ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు :

1. రాంగ్ ఏసీ సైజును ఎంచుకోవడం
మీ ఇంట్లో గదికి సరిపోయే ఏసీని ఎంచుకోవాలి. రాంగ్ ఏసీ సైజు ఎంచుకోవడం వల్ల ఏసీపై ఎక్కువ ప్రెజర్ పడుతుంది. కూలింగ్ అయ్యేందుకు చాలా టైమ్ పడుతుంది. విద్యుత్ ఎక్కువ వృధా చేస్తుంది. మరి పెద్ద ఏసీ తీసుకున్నా గది పూర్తిగా కూల్ అవ్వదు. పైగా అదనపు విద్యుత్తును వినియోగిస్తుంది. ఎల్లప్పుడూ మీ గది పరిమాణానికి సరిపోయే ఏసీ తీసుకోండి.

Read Also : Holi 2026 Offer : పండగ చేస్కోండి.. BSNL స్పెషల్ హోలీ ఆఫర్, ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 164 రోజుల వ్యాలిడిటీ, 2GB హైస్పీడ్ డేటా!

2. ఎనర్జీ, స్టార్ రేటింగ్ చూడకపోవడం :
ధర ముఖ్యమే కానీ సామర్థ్యం కూడా అంతే ముఖ్యం. అధిక మొత్తంలో BEE స్టార్-రేటెడ్ ఏసీలు కొనేటప్పుడు ధర ఎక్కువ ఉంటాయి. కానీ, కాలక్రమేణా విద్యుత్తును ఆదా చేస్తాయి.

3. ఇన్వర్టర్ టెక్నాలజీని పట్టించుకోకపోవడం :
నాన్-ఇన్వర్టర్ ఏసీలు తరచుగా ఆన్ లేదా ఆఫ్ అవుతాయి. ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఇన్వర్టర్ ఏసీలు కంప్రెసర్ స్పీడ్ అడ్జెస్ట్ చేస్తాయి. ఏసీలు సైలెంట్, స్పీడ్ లోడ్, పవర్‌ఫుల్ కెపాసిటీని అందిస్తాయి.

4. ఇన్‌స్టాలేషన్ ఖర్చులను మర్చిపోవడం :
స్ప్లిట్ ఏసీలకు ప్రొఫెషనల్ ఇన్‌స్టాలేషన్, బ్రాకెట్‌లు, కాపర్ పైపింగ్, కొన్నిసార్లు స్టెబిలైజర్లు అవసరం. ఈ ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది.

5. గది పరిమాణాన్ని విస్మరించడం :
నేరుగా సూర్యకాంతి, ఎత్తైన పైకప్పులు, పేలవమైన ఇన్సులేషన్, నివాసితుల సంఖ్య కూలింగ్ ప్రభావితం చేస్తాయి. చదరపు అడుగుల ఆధారంగా మాత్రమే ఏసీని ఎంచుకోవద్దు. గది వాతావరణాన్ని కూడా లెక్కలోకి తీసుకోండి.

6. మెయింట్ నెన్స్ ప్లాన్ స్కిప్ చేయడం :
మీకు దగ్గరలో ఏసీ లోకల్ సర్వీసు ఉందో లేదో చెక్ చేయండి. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

7. ఏసీ పర్ఫార్మెన్స్ కన్నా లుక్‌ ఇంపార్టెన్స్ ఇవ్వడం :
ఏసీ డిజైన్ అద్భుతంగా ఉంది. కానీ కూలింగ్ సామర్థ్యం, ​​వారంటీ, సేల్ తర్వాత సపోర్టు, స్పేర్ పార్ట్స్ లభ్యత వంటివి చాలా ముఖ్యం.

ఈ వేసవిలో కొనేందుకు బెస్ట్ సెల్లింగ్ ఏసీలు :

1. శాంసంగ్ 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (AR12CY3ZAGD) :
ధర : రూ. 31,490
ఈఎంఐ ప్రారంభ ధర : రూ. 1,749
చిన్న రూంలకు బెస్ట్ ఏసీ. ఈ మోడల్‌లో ఫాస్ట్ కూలింగ్ టెక్నాలజీ, ఎక్స్‌ట్రనల్ ఔట్ స్టెబిలైజర్ అవసరం లేకుండా విద్యుత్ హెచ్చుతగ్గుదల సమయంలో ట్రిపుల్ ప్రొటెక్టర్ ప్లస్ సిస్టమ్ ప్రొటెక్షన్ అందిస్తుంది.

2. వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (183V Vectra Prism)
ధర : రూ. 34,990
ఈఎంఐ ప్రారంభ ధర : రూ. 1,944
వేసవిలో మల్టీఫేస్ ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. హీట్ లోడ్ లేదా గదిలోని వ్యక్తుల సంఖ్య ఆధారంగా వివిధ టన్నుల వద్ద ఏసీని నడిపించగలదు. అడ్జెస్ట్ చేయగల కూలింగ్ మోడ్ అందిస్తుంది.

3. డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (MTKL50U)
ధర : రూ. 38,500
ఈఎంఐ ప్రారంభ ధర : రూ. 2,138
ఎకోనో మోడ్, కోండా ఎయిర్‌ఫ్లోకు చెందిన ఈ యూనిట్ కూలింగ్, ఎయిర్ నేరుగా మీ తలపై పడకుండా మెరుగైన సౌకర్యంతో వస్తుంది. గది మొత్తం సమానంగా కూలింగ్ అందుతుంది.

4. బ్లూ స్టార్ 1.5 టన్ 4 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (IA418YATU)
ధర : రూ. 41,990
ఈఎంఐ ప్రారంభ ధర : రూ. 2,332
ఈ హెవీ-డ్యూటీ మోడల్ హీటింగ్ కోసం రూపొందింది. ఇన్ స్టంట్ కూలింగ్ టర్బో కూల్ మోడ్, తుప్పు పట్టని హైక్వాలిటీ రాగి కాయిల్స్‌ ఉన్నాయి.

5. LG 1.5 టన్ 5 స్టార్ ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (TS-Q19YNZE)
ధర : రూ. 46,500
ఈఎంఐ ప్రారంభ ధర : రూ. 2,583
ఏసీ డ్యూయల్ ఇన్వర్టర్ రూమ్ తొందరగా కూల్ అయ్యేలా చేస్తుంది. టాప్ రేంజ్ 5-స్టార్ రేటింగ్‌ అందిస్తుంది. తక్కువ విద్యుత్ బిల్లులతో ఎక్కువ ఆదా చేసుకోవచ్చు.