PM Kisan 22nd Installment 2026 Rs 2000 Payment on march 13 How to Check Status and Beneficiary List
PM Kisan 22nd Installment: దేశవ్యాప్తంగా దాదాపు 9.32 కోట్ల మంది రైతులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత నిధుల విడుదలకు సమయం దగ్గరపడింది. పీఎం కిసాన్ నిధుల విడుదల అధికారిక తేదీని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో అనగా మార్చి 13, 2026న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు. ఈసారి రూ.19 వేల కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్ నిధుల బదిలీ కార్యక్రమం అస్సాం రాష్ట్రంలోని గువాహటి నుంచి ప్రారంభిస్తారు.. అక్కడి నుంచే ప్రధాన మంత్రి డీబీటీ విధానం ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఇప్పటివరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 21 విడతల్లో రూ.4.09 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 22వ విడత పీఎం కిసాన్ నిధులు మార్చి 13న విడుదల కానున్నాయి.
పీఎం కిసాన్ పథకం గురించి
కేంద్రం 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఏటా మూడు దఫాలుగా రూ. 2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నిధులు విడుదల చేస్తారు. ఈ మొత్తం ఆధార్‌కు లింక్ అయిన బ్యాంకు ఖాతాలకు డీబీటీ విధానం ద్వారా నేరుగా జమ అవుతుంది. ప్రస్తుతం దేశంలో రైతులకు అందుతున్న అత్యంత పెద్ద ఆదాయ మద్దతు కార్యక్రమాల్లో పీఎం కిసాన్ నిధి ఒకటి.
ఖరీఫ్ సీజన్‌కు ముందు 22వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఈ మొత్తాన్ని రైతులు విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు. పీఎం కిసాన్ పథకం కింద సాధారణంగా ప్రతి ఏడాది 3 విడతలుగా నిధులు విడుదల చేస్తారు. అవి:
పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే..
రైతులు తమ విడత స్థితిని అధికారిక వెబ్‌సైట్‌లో సులభంగా చూసుకోవచ్చు.
స్టెప్ బై స్టెప్ విధానం: