PM-Kisan 23rd Installment : పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్! ఈ చిన్న మిస్టేక్ చేసినా రూ. 2వేలు పడవు.. అర్జెంట్‌గా ఇలా చేయండి!
PM-Kisan 23rd Installment : అతి త్వరలో పీఎం కిసాన్ 23వ వాయిదా వచ్చేస్తోంది. ఏ కొంచెం పొరపాటు చేసినా రావాల్సిన రూ. 2వేలు వాయిదా అందుకోలేరు. వెంటనే ఈ చిన్న పని పూర్తి చేయడం బెటర్..
- Sreehari A
- Updated on- May 21, 2026 / 05:54 PM IST
PM-Kisan 23rd Installment ( Image Credit : AI )
- పీఎం కిసాన్ 23వ వాయిదాపై కీలక అప్‌డేట్
- కేవైసీ పూర్తి చేయని రైతులకు రూ. 2వేలు కట్
లబ్ధిదారు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?
PM-Kisan 23rd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా రైతుల ఖాతాలకు 3 విడతలలో రూ.6వేలు ఆర్థిక సాయం చేస్తోంది.
ప్రతి విడతకు రూ.2,000తో చొప్పున విడుదల చేస్తోంది. 2026 జూన్-జూలైలో పీఎం కిసాన్ 23వ వాయిదా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, రైతులు తమ కేవైసీని పూర్తి చేయడంలో విఫలమైతే రాబోయే విడత మరింత ఆలస్యం కావచ్చు.
పీఎం కిసాన్ యోజన అంటే ఏంటి? :
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం-కిసాన్) కేంద్ర ప్రభుత్వ ప్రధాన రైతు పథకాలలో ఒకటి. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు వ్యవసాయం, సంబంధిత ఖర్చుల కోసం ప్రతి ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయం అందిస్తారు.
పీఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు వస్తుంది? :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 మార్చి 13న అస్సాంలోని గౌహతిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడతను విడుదల చేశారు. గత విడతను పరిశీలిస్తే రాబోయే 23వ విడత 2026 జూన్ లేదా జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది.
అయితే, ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి రూ. 2వేలు చొప్పున డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు క్రెడిట్ అవుతాయి.
Read Also : Rashi Singh: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రాశి సింగ్.. క్యూట్ ఫొటోలు వైరల్
ఇ-కేవైసీ పూర్తి చేయకపోతే వాయిదా ఆగినట్టే :
పీఎం కిసాన్ యోజన బెనిఫిట్స్ కోసం ప్రతి లబ్ధిదారు రైతు ఇ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇ-కేవైసీ పూర్తి చేయని రైతులకు రూ. 2వేలు పడవు. రైతులు (pmkisan.gov.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో ఇ-కేవైసీని పూర్తి చేయవచ్చు. ఇందుకోసం ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
e-KYC పూర్తి చేసేందుకు 3 మార్గాలివే :
- ఓటీపీ ఆధారిత ఇ-కేవైసీ : పీఎం కిసాన్ పోర్టల్, మొబైల్ యాప్
- బయోమెట్రిక్ ఇ-కేవైసీ : CSC సెంటర్లు, సర్వీసు సెంటర్లు
- పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్, ఇ-కేవైసీ
- ఈ విధంగా మీ పేరు, స్టేటస్ చెక్ చేసుకోండి
రైతులు తమ వాయిదా వస్తుందో లేదో తెలుసుకోవాలంటే స్టేటస్ ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
ఇలా స్టేటస్ చెక్ చేయండి :
- పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- ‘Beneficiary Status’ ఆప్షన్ క్లిక్ చేయండి.
- ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- ‘Get Data’పై క్లిక్ చేయండి.
- పేమెంట్, ‘Beneficiary Status’స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
