PM-Kisan 23rd Installment : రైతులకు బిగ్ అప్‌డేట్! పీఎం కిసాన్ 23వ వాయిదా డేట్ ఇదేనా? రూ.2000 పడతాయా? ఫుల్ డిటెయిల్స్
PM-Kisan 23rd Installment : పీఎం కిసాన్ యోజన 23వ విడత జూన్ 18న రానుందని వదంతులు వస్తున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు..
- Sreehari A
- Published on- June 7, 2026 / 07:11 PM IST
PM-Kisan 23rd Installment
- జూన్ 18న పీఎం కిసాన్ 23వ విడత రానుందా?
- 23వ విడత విడుదల చేసే తేదీపై ఎలాంటి ప్రకటన లేదు
- గతంలో 17వ విడత ఇదే తేదీన విడుదల..
- ఈసారి కూడా వస్తుందని ఊహాగానాలు
PM-Kisan 23rd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ యోజన 23వ విడతకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం జూన్ నెలలో రూ. 2వేలు ఏ తేదీన పడతాయో లేదో ముందుగానే పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నిర్దిష్ట తేదీన పీఎం కిసాన్ 23వ విడతను విడుదల చేసే అవకాశం ఉందని తెగ వార్తలు వస్తున్నాయి.
మార్చి 13న 22వ విడత విడుదల దగ్గర నుంచి రైతులు ఈ విడత కోసం ఎంతో ఆసక్తిగా (PM-Kisan 23rd Installment) ఎదురుచూస్తున్నారు. ఊహాగానాల ప్రకారం.. జూన్ 18న పీఎం కిసాన్ యోజన 23వ విడత నిజంగా విడుదల అవుతుందా? లేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈసారి 23వ విడత జూన్ 18న వస్తుందా? :
పీఎం కిసాన్ యోజన 23వ విడత జూన్ 18న విడుదల అవుతుందని చాలా మంది రైతులు ఆశగా చూస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి తేదీని ప్రకటించలేదు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పీఎం కిసాన్ యోజన 23వ విడత విడుదలకు సంబంధించి అధికారికంగా తేదీని ఇంకా రివీల్ చేయలేదు. అందుకే పీఎం కిసాన్ యోజన 23వ విడత జూన్ 18న అందే అవకాశం చాలా తక్కువగా ఉంది.
గతంలో జూన్ 18నే విడుదల :
2024లో ఇదే రోజున 17వ విడత అందింది. అందుకే జూన్ 18వ తేదీపై తెగ చర్చ నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పీఎం-కిసాన్ పథకం 17వ విడత ద్వారా 92.6 మిలియన్లకు పైగా రైతులకు రూ. 20వేల కోట్లకు పైగా విడుదల చేశారు.
అందుకే, 23వ విడత కూడా జూన్ 18వ తేదీనే వస్తుందేమోనని దేశవ్యాప్తంగా రైతులు భావిస్తున్నారు. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 23వ విడత ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పడం కష్టమే..
లేటెస్ట్ స్టేటస్ చెక్ చేయండి :
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN)23వ విడత ఎప్పుడు వస్తుంది? దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, మీ లేటెస్ట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. ఈ స్టేటస్ మీకు ఎన్ని విడతలు అందాయో మీ ఫారం స్టేటస్ కూడా చూపిస్తుంది.
- స్టేటస్ చెకింగ్ కోసం ముందుగా (pmkisan.gov.in) అధికారిక పోర్టల్‌ను విజిట్ చేయండి.
- ఆ తర్వాత, రైట్ సైడ్ సెక్షన్ వెళ్లి (beneficiary status)పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్‌ను ఇవ్వండి.
- మొబైల్ ఫోన్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేస్తే మీ పేమెంట్ స్టేటస్ చూడొచ్చు.
