PM Kisan 24th Installment : పీఎం కిసాన్ 24వ విడతపై బిగ్ అప్‌డేట్.. ఈ తేదీనే రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు.. ఇ-కేవైసీ స్టేటస్ చెక్ చేశారా?
PM Kisan 24th Installment : పీఎం కిసాన్ 24వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 20న రూ.2,000 జమ అయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. e-KYC, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.
- Sreehari A
- Published on- October 2, 2026 / 03:04 PM IST
PM Kisan 24th Installment Date
- అక్టోబర్ 20న పీఎం కిసాన్ డబ్బులు వచ్చే ఛాన్స్?
- రైతులకు గుడ్ న్యూస్? రూ.2,000 ఎప్పుడు వస్తాయంటే..
- పీఎం కిసాన్ డబ్బుల కోసం వెయిటింగ్..
- e-KYC స్టేటస్ ఇలా చెక్ చేయండి
PM Kisan 24th Installment : దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు 24వ విడత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ నెల ప్రారంభం కావడంతో తదుపరి విడత ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమ అవుతుందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 20న 24వ విడత విడుదలయ్యే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ తేదీపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. పీఎం కిసాన్ పథకం కింద అర్హత ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలు ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతల్లో ఒక్కో విడతకు రూ.2వేలు చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
అక్టోబర్ 20 తేదీనే ఎందుకంటే? :
గత పీఎం కిసాన్ విడతల విడుదల తేదీలను పరిశీలిస్తే.. 23వ విడత జూన్ 20న విడుదలైంది. అంతకుముందు 22వ విడత మార్చి 13న విడుదలైంది. సాధారణంగా పీఎం కిసాన్ విడతల మధ్య సుమారు 4 నెలల వ్యవధి ఉంటుంది.
ఆ లెక్కన చూస్తే జూన్ 20 తర్వాత 4 నెలల సమయంలో అంటే.. అక్టోబర్ 20 ప్రాంతంలో 24వ విడత వచ్చే అవకాశం ఉందని లబ్ధిదారులు అంచనా వేస్తున్నారు. కానీ, 24వ విడత విడుదల తేదీని కేంద్రం అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే కచ్చితమైన తేదీపై క్లారిటీ వస్తుంది.
రైతులు e-KYC స్టేటస్ చెక్ చేసుకోవాలి? :
24వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులు తమ e-KYC, బ్యాంక్ ఖాతా, ఆధార్ లింక్, భూమి వివరాలు వంటివి ముందుగానే పరిశీలించుకోవడం మంచిది. పథకం నిబంధనలకు అనుగుణంగా వివరాలు సరిగ్గా లేకపోతే పేమెంట్ ఆలస్యం లేదా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అధికారిక పీఎం కిసాన్ పోర్టల్‌లో లబ్ధిదారులు తమ స్టేటస్‌ను కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
- ముందుగా అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో ‘Know Your Status’ ఆప్షన్ ఎంచుకోండి.
- మీ (Registration Number)ను ఎంటర్ చేయండి.
- అవసరమైన సెక్యూరిటీ/క్యాప్చా వివరాలను ఎంటర్ చేయండి.
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPను ఎంటర్ చేయండి.
- పీఎం కిసాన్ స్టేటస్, పేమెంట్ వివరాలు తదితర వివరాలను చెక్ చేయండి.
- e-KYC పూర్తయిందో లేదో కూడా సంబంధిత వివరాల్లో చెక్ చేసుకోండి.
ముఖ్యంగా అక్టోబర్ 20న రూ.2వేలు జమ అవుతాయని కచ్చితంగా చెప్పలేం. అక్టోబర్ 20న లేదా ఆ సమయంలో 24వ విడత విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా మాత్రమే. అధికారిక తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుంది.
