PM Kisan Alert : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 23వ విడత వచ్చేస్తోంది.. అర్జెంట్‌గా ఈ 3 పనులు చేయండి.. లేదంటే రూ. 2వేలు పడవు..!
PM Kisan Alert : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత విడుదలైన తర్వాత రైతులు ఇప్పుడు 23వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, తర్వాత వాయిదా రూ. 2వేలు ఖాతాలో పడాలంటే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడం చేయాలి.. అవేంటో ఓసారి చూద్దాం..
- Sreehari A
- Published on- April 23, 2026 / 01:12 PM IST
PM Kisan 23rd Installment
- పీఎం కిసాన్ రైతుల కోసం 23వ వాయిదా వచ్చేస్తోంది
- బ్యాంకు ఖాతాలో డబ్బులు పడాలంటే ఈ పనులు పూర్తి చేయండి
- ఇ-కేవైసీ ప్రాసెస్ చాలా ముఖ్యం, ఎలా చేయాలంటే?
PM Kisan 23rd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. అతి త్వరలో పీఎం కిసాన్ 23వ వాయిదా విడుదల కానుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత ఇప్పటివరకూ రైతులు 22 వాయిదాలను అందుకున్నారు.
ఇప్పుడు 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తర్వాతి విడత వచ్చేలోపు (PM Kisan 23rd Installment) కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడం చాలా ముఖ్యం. లేదంటే ఆ డబ్బు నిలిచిపోవచ్చు లేదా మీ పేరు లిస్టు నుంచి తొలగించే అవకాశం ఉంది.
ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 6వేలు చొప్పున మూడు విడతలలో అందిస్తుంది. అయితే, కొన్నిసార్లు, చిన్న పొరపాట్ల కారణంగా రైతులు ఈ ప్రయోజనాలను పొందలేరు. అందుకే సాధ్యమైనంత తొందరగా గడువు తేదీలోగా మీ సమాచారాన్ని అప్ డేట్ చేసుకోవడం ఎంతైనా మంచిది.
1. ఇ-కేవైసీని పూర్తి చేయడం ముఖ్యం :
మీరు ఇంకా మీ ఇ-కేవైసిని పూర్తి చేయకపోతే మీ తదుపరి వాయిదా ఆలస్యం కావచ్చు. ప్రభుత్వం ఇకేవైసీని తప్పనిసరి చేసింది. ఇది లేకుండా మీ ఖాతాలో డబ్బు డిపాజిట్ కావు. రైతులు (pmkisan.gov.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను ఈజీగా పూర్తి చేయవచ్చు.
2. ఆధార్, బ్యాంకు వివరాలను లింక్ చేసుకోండి :
కొన్నిసార్లు, ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా సమాచారం మధ్య తేడాలు ఉన్నా పేమెంట్లు నిలిచిపోతాయి. పేరు, స్పెల్లింగ్‌లో తేడా ఉండటం లేదా ఆధార్ బ్యాంకుకు లింక్ కాకపోవడం ప్రధాన కారణం. ఇలాంటి పరిస్థితిలో రైతులు వెంటనే తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి.
3. భూమి రికార్డులను అప్ డేట్ చేయాలి? :
ప్రభుత్వం ఇప్పుడు భూమి రికార్డుల ధృవీకరణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ల్యాండ్ డాక్యుమెంట్లు సరిగ్గా అప్ డేట్ చేయని రైతులను లబ్ధిదారుల జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉంది. అందుకే మీ భూమి రికార్డులు అప్ డేట్ చేసుకుని వెరిఫికేషన్ చేయించుకోవడం బెటర్.
స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
రైతులు pmkisan.gov.in ను సందర్శించడం ద్వారా ‘మీ స్థితిని తెలుసుకోండి’ (Know Your Status) లేదా ‘లబ్ధిదారుని స్థితి’ (Beneficiary Status) కింద తమ సమాచారాన్ని తనిఖీ చేసుకోవచ్చు. ఇక్కడ, మీరు ఇ-కెవైసి (e-KYC), ఆధార్ అనుసంధానం భూమి రికార్డుల స్థితిని కనుగొంటారు.
ఇ-కేవైసీని ఎలా పూర్తి చేయాలి
అధికారిక వెబ్‌సైట్‌లోని ఇ-కెవైసి (e-KYC) ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆపై ఓటీపీ (OTP)తో ప్రాసెస్ పూర్తి చేయండి. ఒకవేళ మీ మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే సమీపంలోని సిీస్‌సీ (CSC) సెంటర్ బయోమెట్రిక్స్ ద్వారా కూడా ఇ-కెవైసిని పూర్తి చేయవచ్చు.
పీఎం కిసాన్ 23వ వాయిదా ఎలాంటి అంతరాయం లేకుండా మీ ఖాతాలో డిపాజిట్ కావాలంటే ఈ 3 పనులను ఇప్పుడే పూర్తి చేయండి. చిన్న నిర్లక్ష్యం కూడా మీ మొత్తం వాయిదాను ఆపేస్తుంది జాగ్రత్త.
