PM Kisan Yojana : రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 23వ విడత వచ్చేస్తోంది.. రూ. 2వేలు పడాలంటే ఇలా చేయండి!
PM Kisan Yojana పీఎం-కిసాన్ పథకం 23వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఎప్పటిలాగే, ఈసారి కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2వేల జమ కానుంది. వచ్చే నెల జూన్‌లో ఈ పీఎం కిసాన్ డబ్బులు అందుతాయో లేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- May 15, 2026 / 09:28 PM IST
PM Kisan Yojana 23rd Installment ( Image Credit : AI )
- పీఎం కిసాన్ 23వ వాయిదా కోసం రైతుల ఎదురుచూపులు
- జూన్ లేదా జూలై 2026 నాటికి రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం
- ఇ-కేవైసీ పూర్తి చేయని రైతులకు వాయిదాల చెల్లింపులు ఆలస్యం
PM Kisan Yojana 23rd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 2వేలు జమ కానుంది.
ప్రభుత్వం ఇంకా తదుపరి విడత అధికారిక తేదీని ప్రకటించలేదు. గత రికార్డులను బట్టి చూస్తే.. ఈ మొత్తం (PM Kisan Yojana) వచ్చే నెల జూన్ లేదా జూలై 2026 నాటికి రైతుల ఖాతాల్లో జమ అవుతుందని భావిస్తున్నారు.
అంతకుముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 మార్చి 13న అస్సాంలోని గౌహతి నుంచి 22వ విడతను విడుదల చేశారు. ఆ తర్వాత, రైతులు ఇప్పుడు తదుపరి 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పీఎం కిసాన్ యోజన అంటే ఏంటి? :
ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలు ప్రతి ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయం పొందుతాయి. ఈ మొత్తాన్ని రూ. 2వేల చొప్పున 3 సమాన వాయిదాలలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. వ్యవసాయం సంబంధిత ఖర్చుల విషయంలో రైతులను ఆదుకునేందుకు ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.
తదుపరి వాయిదాకు ఏం అవసరం? :
ఇ-కేవైసీ ఆధార్ లింక్ తప్పనిసరిగా పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇంకా ఇ-కేవైసీ పూర్తి చేయని రైతులు తమ వాయిదాల చెల్లింపులలో ఆలస్యం కావొచ్చు. రైతులు ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లో ఇ-కేవైసీని పూర్తి చేయవచ్చు.
బయోమెట్రిక్ ఇ-కేవైసీ కోసం సమీపంలోని CSC కేంద్రాన్ని విజిట్ చేయొచ్చు. అంతేకాదు.. ఆధార్ నంబర్‌ను బ్యాంకు ఖాతాతో లింక్ చేయడం కూడా అత్యవసరం. కొన్నిసార్లు, చిన్న సాంకేతిక లోపాలు లేదా అసంపూర్ణ సమాచారం కారణంగా పేమెంట్లు ఆలస్యం కావచ్చు.
వాయిదాల స్టేటస్ చెకింగ్ ఇలా :
రైతులు పీఎం-కిసాన్ పోర్టల్‌ను విజిట్ చేయొచ్చు. తద్వారా ఇంటి నుంచే తమ వాయిదాలను చెక్ చూసుకోవచ్చు. ఇందుకోసం వెబ్‌సైట్‌లోని ‘Beneficiary Status’ సెక్షన్‌కు వెళ్లి మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలను ఎంటర్ చేయండి. ఆపై పూర్తి వాయిదాల వివరాలను స్క్రీన్‌పై చూడొచ్చు.
ఎవరి వాయిదా నిలిచిపోతుంది? :
కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పీఎం కిసాన్ సంబంధిత కేసులను విచారిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన పలువురు ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నా లేదా భార్యాభర్తలిద్దరి ఖాతాలకు డబ్బు వస్తున్నా ఆయా పేమెంట్లు నిలిచిపోనున్నాయి.
ఫిబ్రవరి 1, 2019 తర్వాత జరిగిన భూ కొనుగోళ్లకు సంబంధించి కూడా విచారణ జరుగుతోంది. రాబోయే వాయిదా డబ్బులు వెంటనే ఖాతాలకు డిపాజిట్ కావాలంటే రైతులు వెంటనే డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసుకోవడం బెటర్.
