PM Kisan Yojana : రైతులంతా రెడీగా ఉండండి.. పీఎం కిసాన్ 23వ విడత డబ్బులు పడే తేదీ ఇదే.. ఈ పనులు చేస్తేనే రూ. 2వేలు..!

PM Kisan Yojana 23rd Installment : పీఎం కిసాన్ యోజన 22వ విడత అందుకున్నాక దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఇప్పుడు 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 23వ విడత ఎప్పుడు వస్తుంది? ఎవరు అర్హులు? లబ్ధిదారుల స్టేటస్ ఎలా తనిఖీ చేయాలో ఇప్పుడు చూద్దాం..

PM Kisan Yojana 23rd Installment ( Image Credit : Gemini AI )

  • పీఎం కిసాన్ 23వ విడతపై రైతుల్లో ఆశలు, వచ్చే జూలై-ఆగస్టులో రావచ్చు
  • 14 రాష్ట్రాల్లో కొత్త పథకం రిజిస్ట్రేషన్లకు రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి
  • కేవైసీ, ల్యాండ్ సీడింగ్ పనులు పూర్తి చేయని రైతులకు నో పేమెంట్

PM Kisan Yojana 23rd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశంలో లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. 22వ విడత విడుదలైన తర్వాత రైతులు ఇప్పుడు 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రతి ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.6వేలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు రూ.2,000 చొప్పున 3 సమాన వాయిదాలలో పంపిణీ చేస్తోంది. ఈ డబ్బు డీబీటీ (DBT) ద్వారా నేరుగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

మీరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంటే 23వ విడత మీ ఖాతాలో ఎప్పుడు డిపాజిట్ అవుతుందో తప్పనిసరిగా తెలిసి ఉండాలి. మీ ఇంటి నుంచి 23వ విడత స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

23వ విడత రూ. 2వేలు ఎప్పుడు వస్తాయి? :
పీఎం కిసాన్ యోజన కింద వాయిదాలను ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. 22వ వాయిదా మార్చిలో అందింది. ఆ తర్వాత 23వ వాయిదాను 2026 జూలైలో విడుదల చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. అధికారిక సమాచారం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Read Also : Best 5G Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ. 15వేల లోపు 7 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా..?

ఈ రైతులకు 23వ విడత డబ్బులు రావు :
ఇ-కేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ సకాలంలో పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ఈ విడత డబ్బులు అందనున్నాయి. ఒకవేళ మీ ఆధార్ కార్డు మీ బ్యాంకు ఖాతాతో లింక్ చేయకపోతే లేదా మీ కేవైసీ అసంపూర్తిగా ఉన్నా జూలైలో అందాల్సిన రూ. 2వేలు నిలిచిపోవచ్చు. ముందుగానే మీ స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకోవడం ఎంతైనా మంచిది.

ఈ రాష్ట్రాల్లో రైతులకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి :
2026 సంవత్సరం నుంచి 14 రాష్ట్రాలలో పీఎం-కిసాన్ పథకం కింద కొత్తగా రిజిస్టర్ చేసుకునేవారికి రైతు ఐడీ తప్పనిసరి. ఏయే రాష్ట్రాల్లో ఈ ఫార్మర్ ఐడీ అవసరమంటే.. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఉండాలి. మీరు ఈ రాష్ట్రాలలో ఒకదానికి చెందినవారైతే ముందుగా రైతు ఐడీని పొందాలి. అప్పుడే మీరు పీఎం-కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోగలరు.

23వ వాయిదాకు సంబంధించిన పూర్తి వివరాలివే :

  • పీఎం కిసాన్ 23వ విడత వచ్చే జూలైలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
  • ఇ-కెవైసీ ఆధార్ సీడింగ్ పూర్తి చేయకపోతే వాయిదా డబ్బులు రావు
  • ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే ల్యాండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి
  • ఇప్పటివరకు ప్రభుత్వం రైతులకు రూ. 4.27 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి? :

మీ పేరు కొత్త లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే మీరు ఎక్కడికీ పరుగెత్తాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను ఉపయోగించి మీ ఇంటి నుంచే సులభంగా చెక్ చేసుకోవచ్చు.

  • అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్ (pmkisan.gov.in)ను ఓపెన్ చేయాలి.
  • Beneficiary List’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్ ,గ్రామం వివరాలను ఎంటర్ చేయండి.
  • ‘Get Report’పై క్లిక్ చేయండి.
  • మీ గ్రామానికి సంబంధించి పీఎం కిసాన్ మొత్తం లిస్టు కనిపిస్తుంది.
  • మీ పేరు అందులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు
  • మీ గతంలో వాయిదాల స్టేటస్ కూడా చూడవచ్చు.