Post Office FD Rates : సీనియర్ సిటిజన్లకు పండగే.. పోస్టాఫీసులో 24 నెలల FDపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

Post Office FD Rates : పోస్టాఫీసులో ఒక సంవత్సరం, 2 ఏళ్లు, 3 ఏళ్లు, 5 ఏళ్ల కాలపరిమితితో ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలు ఓపెన్ చేయొచ్చు.. 24 నెలల ఖాతాలపై ఎంత వడ్డీ వస్తుందంటే?

Post Office FD Rates

  • సీనియర్ సిటిజన్ల కోసం పోస్టాఫీసులో అద్భుతమైన FD స్కీమ్స్
  • 24 నెలల FD ఖాతాలపై భారీ వడ్డీ రేట్లు పొందొచ్చు
  • పోస్టాఫీసులో ఎఫ్‌డీ పథకాలపై 7.00 శాతం వడ్డీ రేట్లు

Post Office FD Rates : సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలకు బాగా డిమాండ్ ఉంది. పోస్టాఫీసులో సేవింగ్స్ పథకాలపై ఆకర్షణీయమైన రాబడులతో పాటు జమ చేసిన ప్రతి పైసాకు భద్రత ఉంటుంది.

అందుకే, చాలామంది అధిక శాతం వడ్డీ అందించే ఈ పథకాల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పోస్టాఫీస్‌లో 24 నెలల ఎఫ్‌డీపై ఎంత వడ్డీ వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

24 నెలల ఎఫ్‌డీ ఖాతాలపై వడ్డీ ఎంతంటే? :
దేశంలోని అన్ని బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసులు కూడా ఎఫ్‌డీ ఖాతాలను అందిస్తాయి. అయితే, పోస్టాఫీసులలోని ఎఫ్‌డీలను టీడీలు లేదా టైమ్ డిపాజిట్లుగా చెప్పవచ్చు. టైమ్ డిపాజిట్ పథకం బ్యాంకు ఎఫ్‌డీల మాదిరిగానే ఉంటుంది.

మీరు కేవలం ఒకసారి డబ్బు జమ చేస్తే చాలు.. మెచ్యూరిటీ సమయంలో మీ పూర్తి మొత్తాన్ని స్థిర వడ్డీతో పాటు తిరిగి పొందవచ్చు. పోస్టాఫీసులు ఒక ఏడాది, రెండు ఏళ్లు, 3 ఏళ్లు, 5 ఏళ్ల టెన్యూర్ ఎఫ్‌డీ ఖాతాలను అందిస్తాయి.

Read Also : Canara Bank FD Rates : 555 రోజుల FDపై అదిరిపోయే వడ్డీ.. సీనియర్ సిటిజన్లకు కెనరా బ్యాంక్ బంపర్ ఆఫర్

సీనియర్ సిటిజన్లకు రాబడి ఎంతంటే? :
పోస్టాఫీస్ కస్టమర్లకు 24 నెలల (2 ఏళ్లు) ఎఫ్‌డీ పథకాలపై 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. పోస్టాఫీస్ అన్ని వయస్సుల కస్టమర్లకు సమాన వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే, సాధారణ కస్టమర్లతో పోలిస్తే 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న బ్యాంకు కస్టమర్లకు అధిక రాబడిని అందిస్తుంది.

అంతేకాదు.. అనేక బ్యాంకులు 80 ఏళ్లు పైబడిన కస్టమర్లకు ఇంకా అధిక రాబడిని అందిస్తాయి. అయితే, పోస్టాఫీస్ వయోవృద్ధులకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలను అందించదు. పోస్టాఫీస్ సాధారణ కస్టమర్లకు అందించే వడ్డీ రేట్లనే వయోవృద్ధులకు కూడా ఎఫ్‌డీ ఖాతాలపై అందిస్తుంది.

పోస్టాఫీస్ సేవింగ్ పథకాలపై రెపో రేటుకు ఎలాంటి భారీ ప్రభావం ఉండదు. పోస్టాఫీస్ ఎఫ్‌డీ పథకాల వడ్డీ రేట్లపై ఆర్బీఐ రెపో రేటుకు పెద్దగా ప్రభావం ఉండదు. పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లను భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది.

ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను ఇదే శాఖ రివ్యూ చేసి అవసరమైన మార్పులు చేస్తుంది. అయితే, ఎఫ్‌డీ ఖాతాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లు మాత్రం ఆర్బీఐ రెపో రేటు ఆధారంగానే నిర్ణయిస్తారు.