Petrol Prices : భారీగా పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు.. మీ సిటీలో లీటర్ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

Petrol Prices : ప్రీమియం పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ప్రీమియం 100 ఆక్టేన్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 11 పెరిగి మొత్తంగా రూ. 160కి చేరింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Petrol Prices

  • ప్రీమియం పెట్రోల్ ధరలు ఎంత పెరిగాయంటే?
  • 100 ఆక్టేన్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 11 పెరిగింది
  • ప్రీమియం పెట్రోల్ ధర రూ.160కి చేరింది

Petrol Prices : ప్రీమియం పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. అమెరికా- ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. దేశీయ ప్రీమియం 100-ఆక్టేన్ పెట్రోల్ ధర లీటరుకు రూ.11 పెరిగింది. ఈ హై పర్ఫార్మెన్స్ అందించే ఇంధనాన్ని ప్రధానంగా లగ్జరీ కార్లు, సూపర్‌బైక్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఢిల్లీలో ఈ ప్రీమియం పెట్రోల్ ధర ఏకంగా రూ.160కి చేరింది. ఇప్పటివరకు రిటైల్ ఇంధన ధరలలో ఇదే అతిపెద్ద పెరుగుదల. ఎక్స్‌ట్రా గ్రీన్ ప్రీమియం డీజిల్ ధర కూడా లీటరుకు రూ.1.50 పెరిగి రూ.92.99కి చేరింది.

ప్రీమియం డీజిల్ వేరియంట్ ఎక్స్‌ట్రా గ్రీన్ ధర కూడా లీటరుకు రూ.91.49 నుంచి రూ.92.99కి పెరిగింది. అయితే, సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం.. ‘సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. ఢిల్లీలో ధర లీటరుకు వరుసగా రూ.94.77, రూ.87.67గా ఉంది’ అని పేర్కొంది.

నైరా తర్వాత, షెల్ ఇండియా కూడా రేటును పెంచింది. ప్రైవేట్ కంపెనీలు చమురు ధరలను పెంచడం ప్రారంభించాయి. నయారా బాటలోనే షెల్ ఇండియా కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఈ కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు రూ.7.41, డీజిల్ ధరను లీటరుకు రూ.25.01 పెంచింది.

Read Also : Hyundai Car Discounts : హ్యుందాయ్ డిస్కౌంట్ ధమాకా.. వెర్నా, క్రెటా, i20 కార్లపై రూ. 1.10 లక్షల డిస్కౌంట్.. ఫుల్ లిస్ట్ ఇదే!

ఇతర ఇంధన ధరల్లో మార్పులు :
దేశీయ విమానయాన సంస్థల జెట్ ఇంధనం ధర 8.56 శాతం పెరిగి కిలోలీటరుకు రూ. 1,04,927.18కి చేరగా, ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పీజీ ధర 19 కేజీల సిలిండర్‌కు రూ. 195.50 పెరిగి రూ. 2,078.50కి చేరింది. ఇంటి వంటగ్యాస్ ధర 14.2 కేజీల సిలిండర్‌కు రూ. 913 వద్ద స్థిరంగా ఉంది. మే నెలాఖరు నాటికి చమురు కంపెనీలు రూ. 40,484 కోట్ల వరకు నష్టాలను చవిచూడవచ్చని అంచనా.

పెట్రోల్ ధర ఎంతంటే?

  • న్యూఢిల్లీ రూ.94.77
  • కోల్‌కతా రూ.105.41
  • ముంబై రూ.103.54
  • చెన్నై రూ.100.80
  • బెంగళూరు రూ.102.92
  • హైదరాబాద్ రూ.107.50

డీజిల్ ధర ఎంతంటే? :

  • న్యూఢిల్లీ రూ. 87.67
  • కోల్‌కతా రూ.92.02
  • ముంబై రూ.90.03
  • చెన్నై రూ.92.39
  • బెంగళూరు రూ.90.99
  • హైదరాబాద్ రూ.95.70

XP100 పెట్రోల్ ఏంటి? :
ఎక్స్‌పీ అనేది 100 ఆక్టేన్ సంఖ్యతో ఎక్కువ స్ట్రాంగ్ ఉండే హై గ్యాసోలిన్. వాహనం సాఫీగా నడిచేందుకు ఎక్కువ పవర్ అందిస్తుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ పెరిగేందుకు దీన్ని వాడుతారు. సాధారణ గ్యాసోలిన్ కన్నా అత్యంత ఖరీదైనది.

ప్రపంచ ముడి చమురు కొరత :
నెల రోజుల లోపే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి. హోర్ముజ్ జలసంధి మూసివేత మార్కెట్లపై మరింత ఒత్తిడిని పెంచింది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రస్తుతం సాధారణ పెట్రోల్‌పై లీటరుకు రూ. 24.40, డీజిల్‌పై ఏకంగా రూ. 104.99 మేర నష్ట భారాన్ని మోస్తున్నాయి.