RBI Rate Hike : రెపో రేటుపై ఉత్కంఠ.. లోన్ తీసుకున్నారా? EMI షాక్ తప్పదా.. FD పెట్టుబడిదారులకు జాక్‌పాట్!
RBI Rate Hike : ఆర్బీఐ రెపో రేటును పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హోం లోన్లు, పర్సనల్ లోన్లు ఏదైనా రుణం తీసుకున్నవారిపై ఈఎంఐల భారం భారీగా పడనుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసినవారికి మాత్రం వడ్డీ కూడా పెరగనుంది.
RBI Rate Hike
- ఆర్బీఐ రెపో రేటుపై ఉత్కంఠ.. రుణగ్రహీతలకు టెన్షన్.. FD దారులకు తీపికబురు
- హోమ్ లోన్ నుంచి FD వరకు ఎవరికి భారం? ఎవరికి లాభమంటే?
- రెపో రేటు పెరిగితే ఈఎంఐ పెరుగుతుందా? FDపై వడ్డీ ఎంతంటే?
RBI Rate Hike : లోన్లు తీసుకున్నారా? కొత్తగా లోన్లు తీసుకోవాలని చూస్తున్నారా? భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటుపై త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. రెపో రేటను పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే సామాన్యులపై నేరుగా ప్రభావం పడనుంది.
ముఖ్యంగా హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటి ఫ్లోటింగ్ రేట్ లోన్లు తీసుకున్నవారికి బిగ్ షాక్ తగలనుంది. రాబోయే అక్టోబర్ పాలసీ (RBI Rate Hike) సమావేశంలో రెపో రేటును 0.25 శాతం పెంచే అవకాశం ఉందని సమాచారం. తద్వారా బ్యాంకులు తమ రుణాలపై భారీ మొత్తంలో వడ్డీ రేట్లను పెంచుతాయి. ఇప్పటికే ఫ్లోటింగ్ రేట్‌పై లోన్ తీసుకున్నవారికి వడ్డీ భారం కూడా పెరగొచ్చు. ఫలితంగా ఈఎంఐలు కూడా భారీగా పెరుగుతాయి..
రెపో రేటు పెంపుతో బ్యాంకులపై భారం :
రెపో రేటును పెంచితే బ్యాంకులు ఆర్బీఐ నుంచి భారీ మొత్తంలో అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. దీని ప్రభావంతో బ్యాంకులు తమ రుణాలపై వడ్డీ రేట్లను పెంచాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫ్లోటింగ్ రేట్‌పై లోన్ తీసుకున్నవారికి వడ్డీ భారం పెరగొచ్చు. ఫలితంగా ఈఎంఐ పెరగడం లేదా లోన్ టెన్యూర్ కూడా పెంచాల్సిన పరిస్థితి రావచ్చు. కొత్తగా లోన్ తీసుకునేవారు కూడా అధిక వడ్డీ రేట్లను చెల్లించాల్సి రావొచ్చు.
ఫిక్స్డ్ డిపాజిట్లపై భారీ వడ్డీలు :
అయితే, ఇదే సమయంలో డిపాజిటర్లకు కొంత రిలీఫ్ కలిగించే ఛాన్స్ ఉంది. వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకులు కొత్త ఫిక్స్డ్ డిపాజిట్లపై అద్భుతమైన వడ్డీ రేట్లను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లకు చాలా బెనిఫిట్. అయితే, ఇప్పటికే ఉన్న FDలపై వెంటనే అదనపు వడ్డీ లభిస్తుందని కాదు.. కొత్తగా ఎఫ్డీ చేసే సమయంలో లేదా పాత డిపాజిట్ మెచ్యూర్ అయితే ఆయా వడ్డీ రేట్లను కంపేర్ చేసుకోవాలి.
రెపో రేటు పెంపు ప్రధాన లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే. వడ్డీ రేట్లు పెరగడంతో రుణాల డిమాండ్ తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహం కొంత మందగించే ఛాన్స్ ఉంటుంది. తద్వారా ధరల పెరుగుదలను కంట్రోల్ చేసేందుకు ఆర్బీఐ రెపో రేటులో మార్పులు చేస్తుంది.
అందుకే, లోన్ తీసుకున్నవాళ్లు ముందుగానే ఈఎంఐ భారం, ఆదాయం, భవిష్యత్ ఖర్చులను అంచనా వేసుకోవడం బెటర్. FD పెట్టుబడిదారులు మాత్రం వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, కాలపరిమితి, ముందస్తు విత్ డ్రా నిబంధనలను పరిశీలించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.
