Redmi 100-Inch TV : ఇంట్లోనే సినిమా థియేటర్ ఫీల్.. 100 అంగుళాల భారీ రెడ్‌మి స్మార్ట్‌టీవీ చూశారా? ధర తెలిస్తే షాక్ అవుతారు!
Redmi 100-Inch TV Launch : కొత్త టీవీ కొనేవారికి అదిరిపోయే న్యూస్.. 100 అంగుళాల రెడ్‌మి టీవీ చూశారా? మీ ఇంటినే సినిమా థియేటర్ గా మార్చేస్తుంది.. ధర, ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published On : March 23, 2026 / 06:29 PM IST
Redmi 100-Inch TV
- సినిమా థియేటర్ సైజులో కొత్త రెడ్‌మి టీవీ చూశారా?
- 100-అంగుళాల రెడ్‌మి టీవీ మ్యాక్స్, మరెన్నో ఫీచర్లు
- 4K రిజల్యూషన్, 144Hz హై రిఫ్రెష్ రేట్
- ఈ భారీ టీవీ మోడల్ ధర రూ. 120,000 ఉంటుంది
Redmi 100-Inch TV Launch : కొత్త స్మార్ట్‌టీవీ కొనాలని చూస్తున్నారా? 2026లో మీ లివింగ్ రూమ్‌ను లగ్జరీ థియేటర్‌గా మార్చేయాలని ఉందా? మీకోసం షావోమీ సబ్-బ్రాండ్ రెడ్‌మి చైనాలో అత్యంత పవర్‌ఫుల్ టీవీని లాంచ్ చేసింది. తద్వారా టెక్ ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది. ఈ కొత్త లైనప్‌లో రెడ్‌మి టీవీ మ్యాక్స్ 100-అంగుళాల మోడల్ అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది.
భారీ స్క్రీన్, అద్భుతమైన 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఇది గేమింగ్, సినిమా ప్రియులకు అద్భుతమైన ఆప్షన్. సుమారు రూ. 120,000 ధర ఉంటే ఈ 100-అంగుళాల టీవీ మోడల్ మీ ఇంటికి లగ్జరీ లుక్ మాత్రమే కాదు.. పవర్‌ఫుల్ 5-కోర్ ప్రాసెసర్ సినిమా థియేటర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
రెడ్‌మి టీవీ మ్యాక్స్ 100-అంగుళాలు, ఫీచర్లు :
భారీ స్క్రీన్ ఇష్టపడే యూజర్లకు రెడ్‌మి 100-అంగుళాల స్మార్ట్ టీవీ కొనేసుకోవచ్చు. ఈ టీవీ 4K రిజల్యూషన్, 144Hz హై రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. యాక్షన్ సినిమాలు, హై-గ్రాఫిక్స్ గేమ్‌లు ఎలాంటి లాగ్ లేకుండా స్పీడ్ రన్ అవుతాయి.
ఈ రెడ్‌మి టీవీ అద్భుతమైన 400-600 నిట్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. తక్కువ కాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆడియో అవుట్‌పుట్ కోసం కంపెనీ పవర్‌ఫుల్ 30W స్పీకర్ సిస్టమ్, సరికొత్త HDMI 2.1 సపోర్ట్ అందిస్తుంది. నెక్స్ట్-జెన్ గేమింగ్ కన్సోల్‌లకు చక్కగా సరిపోతుంది.
పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. ఈ టీవీలో పవర్‌ఫుల్ A55-ఆధారిత 5-కోర్ ప్రాసెసర్, భారీ 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ పవర్‌ఫుల్ కాన్ఫిగరేషన్ భారీ యాప్, హై-డెఫినిషన్ కంటెంట్‌ను క్షణాల్లో లోడ్ చేస్తుంది.
తద్వారా యూజర్లకు అద్భతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అదే ప్రీమియం ఫీచర్లతో చిన్న సైజులో కోరుకునే వారి కోసం కంపెనీ సుమారు రూ. 66,040 ధరతో 85-అంగుళాల వేరియంట్ కూడా ప్రవేశపెట్టింది.
సరసమైన ధరలో రెడ్‌మి టీవీలు :
రెడ్‌మి కేవలం ప్రీమియం కస్టమర్లనే కాదు.. బడ్జెట్ ఫ్యామిలీ కస్టమర్లు లక్ష్యంగా అద్భుతమైన టీవీలను అందిస్తోంది. ఈ కంపెనీ కొత్త రెడ్‌మి ప్రో సిరీస్‌ను 43-అంగుళాల నుంచి 75-అంగుళాల వరకు వివిధ సైజు ఆప్షన్‌లలో ప్రవేశపెట్టింది.
బేస్ 43-అంగుళాల వేరియంట్ ధర సుమారు రూ. 25,000 నుంచి ప్రారంభమవుతుంది. 75-అంగుళాల మోడల్ సుమారు రూ. 50,000 ధరకు అందుబాటులో ఉంది. మిడ్ రేంజ్ యూజర్లకు అదిరిపోయే డీల్.
ఈ సిరీస్‌లో చాలా మోడళ్లు 4K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. అయితే బేస్ వేరియంట్ 60Hz ప్యానెల్‌తో వస్తుంది. 94శాతం డీసీఐ-P3 కలర్ గామట్‌కు సపోర్ట్ చేస్తుంది. సరసమైన ధరలో మోడ్రాన్ ఫీచర్లు కోరుకునే వారికి అద్భుతమైన టీవీ అని చెప్పొచ్చు.
