Redmi Note 13R Pro Launch : రెడ్‌మి నోట్ 13ఆర్ ప్రో వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Redmi Note 13R Pro Launch : రెడ్‌మి నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. రెడ్‌మి నోట్ 13ఆర్ ప్రో అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందుగానే ఫీచర్లు, స్పెషిఫికేషన్లు లీకయ్యాయి.

Redmi Note 13R Pro Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. రెడ్‌మి నోట్ 13ఆర్ ప్రో ఇప్పుడు చైనా టెలికాం వెబ్‌సైట్‌లో రెండర్‌లు, ధర వివరాలు, ముఖ్య స్పెసిఫికేషన్‌లతో లాంచ్ కానుంది. రెడ్‌మి నోట్ 13ఆర్ ప్రో మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

Read Also : Redmi Note 13 Pro Series : రెడ్‌మి నోట్ 13ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. ఏయే కెమెరా ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

ఫోన్ హోల్ పంచ్ కటౌట్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 108ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 16ఎంపీ సెల్ఫీ సెన్సార్‌ను కూడా అందిస్తుంది. రెడ్‌మి నోట్ 13ఆర్ ప్రో, రెడ్‌మి నోట్ 12ఆర్ ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తుందని భావిస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ద్వారా అందిస్తుందని భావిస్తున్నారు.

రెడ్‌మి నోట్ 13ఆర్ ప్రో ధర (అంచనా) :
చైనా టెలికాం లిస్టింగ్ ప్రకారం.. రెడ్‌మి నోట్ 13ఆర్ ప్రో చైనాలో 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,999 (దాదాపు రూ. 23వేలు)గా నిర్ణయించింది. ఈ మోడల్ నంబర్ (2311FRAFDC)తో లిస్టు అయింది. ఈ హ్యాండ్‌సెట్ మిడ్‌నైట్ బ్లాక్, టైమ్ బ్లూ, మార్నింగ్ లైట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Redmi Note 13R Pro Price, Specifications

రెడ్‌మి నోట్ 13ఆర్ ప్రో స్పెసిఫికేషన్స్ (అంచనా) :
జాబితా ప్రకారం.. రాబోయే రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే సెంటర్ హోల్ పంచ్ కటౌట్‌తో వస్తుంది. ఈ ఫోన్ లిస్టింగ్‌లోని ప్రాసెసర్ (MT6833P) అనే కోడ్‌నేమ్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఎస్ఓసీతో వస్తుంది. ప్రాసెసర్ గరిష్టంగా 16జీబీ ర్యామ్ గరిష్టంగా 256జీబీ స్టోరేజీతో వస్తుంది.

రెడ్‌మి నోట్ 13ఆర్ ప్రోలో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెకండరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ని సూచిస్తుంది. సెల్ఫీలకు ముందు భాగంలో 16ఎంపీ సెన్సార్‌ను అందిస్తుంది. అథెంటికేషన్ కోసం ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌తో వస్తుంది. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, డిస్టెన్స్ సెన్సార్ ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ, టైప్-సి పోర్ట్, జీపీఎస్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి.

రెడ్‌మి నోట్ 13ఆర్ ప్రో, రెడ్‌మి నోట్ 12ఆర్ ప్రో 5Gపై అప్‌గ్రేడ్‌లను అందిస్తుందని భావిస్తున్నారు. రెండోది మేలో చైనాలో సీఎన్‌వై 1,999 (దాదాపు రూ. 23,700) ధరతో రానుంది. రెడ్‌మి నోట్ 12ఆర్ ప్రో 5జీ మోడల్ 6.67-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ (1,080×2,400) ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 12జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజీతో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ఎస్ఓసీపై రన్ అవుతుంది. 48ఎంపీ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

Read Also : Redmi Note 12 5G Sale : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 11వేల లోపు ధరకే రెడ్‌మి 5G ఫోన్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

ట్రెండింగ్ వార్తలు