Redmi Note 13 Pro Series : రెడ్‌మి నోట్ 13ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. ఏయే కెమెరా ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

Redmi Note 13 Pro Series : రెడ్‌మి నోట్ 13 ప్రో సిరీస్ వచ్చేస్తోంది. ఈ నెలాఖరులోనే ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో 200MP బ్యాక్ కెమెరా యూనిట్‌లను ప్రదర్శించనుంది.

Redmi Note 13 Pro Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రెడ్‌మి (Redmi) నుంచి రెడ్‌మి నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro) సిరీస్ ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది. షావోమీ (Xiaomi) సోమవారం (సెప్టెంబర్ 11) Weibo ద్వారా ధృవీకరించింది.

ఈ లైనప్‌లో రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ గత ఏడాదిలో రెడ్‌మి నోట్ 12 ప్రో, రెడ్‌మి నోట్ 12 ప్రో+ కి అప్‌గ్రేడ్‌గా ఉంటాయి. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు 200MP బ్యాక్ కెమెరా యూనిట్‌లను టీజర్ ద్వారా రివీల్ చేసింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మి నోట్ 13 ప్రో+లో కొత్త MediaTek చిప్‌సెట్, కస్టమైజ్ చేసిన శాంసంగ్ ISOCELL కెమెరా సెన్సార్‌ను అందిస్తుంది.

Read Also : Apple iPhone 13 mini : ఆపిల్ ఐఫోన్ 13 మినీ ఇక కనిపించదా? ఐఫోన్ 15 లాంచ్ తర్వాత పూర్తిగా నిలిచిపోనుందా? ఇదే చివరి అవకాశం..!

Weibo ద్వారా షావోమీ ఈ నెలాఖరులో రెడ్‌మి నోట్ 13 ప్రో సిరీస్‌ను ఆవిష్కరిస్తామని ధృవీకరించింది. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో మల్టీ టీజర్‌లను షేర్ చేసింది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరా స్పెసిఫికేషన్‌లు, చిప్‌సెట్‌ను వెల్లడిస్తుంది. రెడ్‌మి లేటెస్ట్ సిరీస్ శాంసంగ్ MediaTekతో కలిసి పనిచేసింది. రెడ్‌మి నోట్ 13ప్రో లైనప్ 200MP బ్యాక్ కెమెరా సెటప్‌తో వస్తుంది. రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ కొత్త 4nm ​​MediaTek డైమెన్సిటీ 7200-Ultra SoCలో రన్ అయ్యేలా టీజ్ చేసింది.

Redmi Note 13 Pro Series to Launch in September, Redmi Note 13 Pro Plus Will Run on Dimensity 7200 Ultra SoC

కొత్త చిప్‌సెట్ iQoo Z7 Pro 5G, Vivo V27లో ఉపయోగించిన సాధారణ డైమెన్సిటీ 7200 SoC కన్నా అప్‌గ్రేడ్ అవుతుంది. ఇంకా, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ మెరుగైన ఇమేజ్ 200MP శాంసంగ్ ISOCELL HP3 డిస్కవరీ ఎడిషన్ కెమెరా సెన్సార్, సపోర్టెడ్ వెర్షన్‌ను కలిగి ఉంది. ఈ కస్టమైజడ్ శాంసంగ్ సెన్సార్ గత ఏడాదిలో Redmi Note 12 Pro+ 5G ఉపయోగించిన 200MP శాంసంగ్ HPX సెన్సార్‌తో సమానంగా ఉంటుంది.

ఇటీవల, రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ మోడల్ నంబర్లు 2312DRA50C, 2312DRA50Cతో TENAA వెబ్‌సైట్‌లో గుర్తించింది. లిస్టు ప్రకారం.. 6.67-అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. 5G కనెక్టివిటీని అందిస్తోంది. రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 18GB RAMతో వస్తుందని అంచనా.

రెడ్‌మి నోట్ 13 ప్రో 16GB RAM వరకు అందిస్తుంది. TENAA లిస్టు డివైజ్‌ల కోసం 4 RAM స్టోరేజీ ఆప్షన్లను సూచించింది. 16MP సెల్ఫీ కెమెరాను కూడా ఉంచవచ్చు. రెడ్‌మి నోట్ 13ప్రో ఫోన్ 5,020mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 880mAh బ్యాటరీని పొందవచ్చు.

Read Also : Lava Blaze 2 Pro : కొత్త ఫోన్ కావాలా? లావా బ్లేజ్ 2 ప్రో ఫోన్ వచ్చేసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు