Reliance Jio : పండగ చేస్కోండి.. జియో లాంగ్ టైమ్ ప్లాన్.. సింగిల్ రీఛార్జ్‌తో 336 రోజులు ఎంజాయ్.. 168GB హైస్పీడ్ డేటా
Reliance Jio : సరసమైన ధరలో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? రిలయన్స్ జియో రూ. 1234 బెస్ట్ ప్లాన్ అందిస్తోంది. జియో యూజర్లు కేవలం రూ. 1234కే పూర్తి 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.
- Sreehari A
- Published On : March 24, 2026 / 10:29 PM IST
Reliance Jio
- జియో రూ. 1234 రీఛార్జ్ ప్లాన్, మరెన్నో డేటా బెనిఫిట్స్
- 336 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 0.5GB హైస్పీడ్ డేటా
- 300 ఫ్రీ ఎస్ఎంఎస్, 168 GB డేటా బెనిఫిట్స్
Reliance Jio : రిలయన్స్ జియో యూజర్లకు అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్.. ఒకసారి రీచార్జ్ చేశారంటే దాదాపు ఏడాది మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం టెలికం మార్కెట్లో ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా Vi వంటి కంపెనీలు లాంగ్ టైమ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచేస్తున్నాయి.
తక్కువ డేటాతో ఎక్కువ వ్యాలిడిటీ అందించే ప్లాన్లు ప్రస్తుతం అందుబాటులో లేవు. జియో అందించే సరసమైన రూ. 1234 రీఛార్జ్ ప్లాన్ అందరికి వర్తించదు. ఈ జియో ప్లాన్ ద్వారా అద్భుతమైన కాలింగ్, డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. సరసమైన ధరలో జియో ప్లాన్ తీసుకోవచ్చు. అద్భుతమైన బెనిఫిట్స్, డేటా లిమిట్స్ గురించి ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
336 రోజుల రీఛార్జ్ ఆఫర్ :
ఏడాది మొత్తం రీఛార్జ్ అవసరం లేకుండా ఉండాలంటే రిలయన్స్ జియో ఈ రూ. 1234 ప్లాన్ ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మీరు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సుమారు 11 నెలల వరకు మళ్లీ స్టోర్‌కు లేదా ఆన్‌లైన్ రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం కాలింగ్, ఎక్కువ వ్యాలిడిటీ అవసరమయ్యే వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది.
డేటా, కాలింగ్ బెనిఫిట్స్ :
ప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ఈ రీఛార్జ్ ప్లాన్ యూజర్లకు రోజుకు 0.5GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మొత్తం 336 రోజులలో మీకు 168 GB డేటా లభిస్తుంది. డేటా అయిపోతే మీ ఇంటర్నెట్ స్పీడ్ 64kbpsకి పడిపోతుంది.
కానీ, మీకు నెట్ వర్క్ కనెక్షన్ కొనసాగుతూనే ఉంటుంది. ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ప్రతి 28 రోజులకు 300 ఫ్రీ SMS లభిస్తాయి. ఎంటర్‌టైన్మెంట్ కోసం జియోసావన్, జియోటీవీకి స్పెషల్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
కేవలం జియో భారత్ ఫోన్ యూజర్లకే :
జియో అందిస్తున్న ఈ రూ. 1234 అద్భుతమైన ఆఫర్ స్మార్ట్‌ఫోన్ యూజర్లందరికి అందుబాటులో లేదు. ప్రత్యేకంగా కంపెనీ సరసమైన జియో భారత్ ఫోన్‌ను వాడే కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
మార్కెట్ ధరలను పోల్చి చూస్తే.. ప్రీమియం, చౌక ధరల మధ్య ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) జియో కన్నా వెనుకబడి ఉన్నాయి. ప్రస్తుతం, ఏ ప్రైవేట్ టెలికాం కంపెనీ కూడా రూ. 1234 దగ్గరగా 336 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ అందించడం లేదు.
ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా లాంగ్ టైమ్ ప్లాన్ ధరలు రూ. 2వేల నుంచి రూ.3వేల మ్యాజికల్ మార్క్‌ను దాటాయి. అందుకే ఈ రీఛార్జ్ జియో భారత్ ఫోన్ యూజర్లకు అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ అని చెప్పొచ్చు.
