Robert kiyosaki predicts : బంగారం, వెండి ధరలపై బాంబు పేల్చిన రాబర్ట్ కియోసాకి.. ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. వచ్చేది పెను సంక్షోభమే..
Robert kiyosaki predicts : ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లకు సుపరిచితమైన ఆర్థిక వేత్త, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
- Harish Thanniru
- Updated on- April 30, 2026 / 09:22 AM IST
Robert kiyosaki predicts 2026-27 economic crisis warning
- ఇన్వెస్టర్లకు రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
- మార్కెట్లు అత్యంత భయంకరమైన పతనాన్ని చవిచూడబోతున్నాయి..
- తెలివైన పెట్టుబడిదారులకు అద్భుతమైన అవకాశం
Robert kiyosaki predicts : ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లకు సుపరిచితమైన ఆర్థిక వేత్త, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2026 -2027 మధ్య కాలంలో ప్రపంచ మార్కెట్లు అత్యంత భయంకరమైన పతనాన్ని చవిచూడబోతున్నాయ్ని.. ఇది దాదాపు మహా మాంద్యం వంటి పరిస్థితికి దారితీస్తుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. రాబోయే మార్కెట్ పతనంలో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారని.. ఒక వర్గం ఆర్థికంగా నష్టపోతే, మరో వర్గం అదే పరిస్థితిని అవకాశంగా మార్చుకుని లాభపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై మొగ్గుచూపుతారు. అయితే, తాజాగా.. కియోసాకి అంచనా ప్రకారం.. రాబోయే ఈ ఆర్థిక సంక్షోభం తరువాత విలువైన లోహాలైన బంగారం, వెండి ధరలు ఊహకందని స్థాయికి చేరుకుంటాయని అంచనా వేశారు. ఈ క్రమంలో మార్కెట్ పతనం సంభవించిన ఒక సంవత్సరంలోపు బంగారం ధర ఔన్సుకు 35వేల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. అయితే, ఇది ప్రస్తుత ధరలతో పోలిస్తే విపరీతమైన పెరుగుదలగా చూడొచ్చు. ఇదే సమయంలో వెండి ధర ఔన్సుకు 200 డాలర్ల స్థాయిని తాకుతుందని ఆయన అంచనా వేశారు.
ఏదేమైనా రాబోయే 2026-27 సంవత్సరాలు ఆర్థికంగా కఠినమైనవి కావచ్చు. కానీ, సరైన ప్రణాళిక, దృఢ నిశ్చయం ఉన్నవారికి ఇవి సంపదను నిర్మించుకోవడానికి లభించే సువర్ణావకాశాలు అని కియోసాకి పేర్కొన్నారు. బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులను కలిగి ఉండటం ద్వారా రాబోయే మహా మాంద్యం నుండి రక్షణ పొందడమే కాకుండా, గొప్ప లాభాలను కూడా ఆర్జించవచ్చునని ఆయన సూచించారు.
ఆయన ట్వీట్ లో పేర్కొన్న ప్రకారం.. రాబోయే ఈ సంక్షోభంలో బహుశా ఇది ఒక మహా మాంద్యం కావచ్చు. మీరు నష్టపోతారా.. లేదంటే అదృష్ట వంతులు అవుతారా.? అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఇప్పటి వరకు 1987, 2000, 2008, 2015, 2019, 2022 సంవత్సరాల సంక్షోభాలలో నేను ధనవంతుడిని అయ్యాను కానీ పేదవాడిని కాలేదు. మళ్లీ 2026-27 సంవత్సరాల్లో రాబోయే ఈ భారీ సంక్షోభంలో కూడా నేను పేదవాడిని కాకుండా ధనవంతుడిని కావాలని ప్రణాళిక వేసుకున్నాను. మీకు కూడా ఇదే జరగాలని నేను కోరుకుంటున్నాను. సంక్షోభం, మాంద్యం, ఆర్థిక సంక్షోభం సమయంలో, గొప్ప ఆస్తులు తక్కువ ధరకు లభిస్తాయి. తక్కువ ధరకు లభవించే ఆస్తులను కొనుగోలు చేయడం ద్వారా ధనవంతులు అవ్వండి. దయచేసి సర్వనాశనం అవ్వకండి అదృష్టవంతులు అవ్వండి జాగ్రత్త అంటూ రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.
IN THIS COMING CRASh possibly a Grest Drpression…. Will you be “FU’CD UP or LU’CD UP.”
So far….in the crashes of 1987, 2000, 2008, 2015, 2019, 2022 I got richer not poorer.
And again in coming giant crash of 2026-27….I plan on growing richer not poorer.
I wish the same for…
— Robert Kiyosaki (@theRealKiyosaki) April 28, 2026
