×
Ad

Samsung Galaxy A55 : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ అమెజాన్‌లో జస్ట్ రూ. 25,999కే.. ఎలాగంటే?

Samsung Galaxy A55 : శాంసంగ్ గెలాక్సీ A55 ధర భారీగా తగ్గిందోచ్.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో అసలు ధర రూ. 42,999 నుంచి రూ. 25,999కే లభ్యమవుతోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy A55 Image Credit To Original Source)

  • జనవరి 16 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్
  • ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ పై బిగ్ డిస్కౌంట్
  • 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. రూ. 42,999
  • 43శాతం తగ్గింపు తర్వాత ధర కేవలం రూ. 25,999 మాత్రమే

Samsung Galaxy A55 : కొత్త ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సేల్ సమయంలో అనేక బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డీల్స్ పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A55 5Gపై సూపర్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర నుంచి రూ. 16వేల తగ్గింపుతో అందిస్తోంది. మీరు శాంసంగ్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే అసలు మిస్ చేసుకోవద్దు.. శాంసంగ్ ఫోన్ ఆఫర్లు, డిస్కౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ A55 ధర తగ్గింపు :
ధర విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 42,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ సమయంలో 43శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ తర్వాత శాంసంగ్ ఫోన్ ధర రూ. 25,999కు తగ్గుతుంది.

Samsung Galaxy A55 Image Credit To Original Source)

ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఈఎంఐ :
బ్యాంక్ ఆఫర్ల కింద మీరు అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ. 779 సేవ్ చేసుకోవచ్చు. అదనంగా, మీ పాత ఫోన్‌ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 24,500 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ. 914 ఈఎంఐ ఆప్షన్‌లో కూడా కొనేసుకోవచ్చు.

Read Also : Vivo T4 Pro Discount : ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్.. వివో T4 ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్.. ధర ఎంత తగ్గిందంటే?

డిస్‌ప్లే, ప్రాసెసర్ :
120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2340×1080 పిక్సెల్‌ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కోసం ఎక్సినోస్ 1480 చిప్‌సెట్‌తో వస్తుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. అదనంగా, వన్ యూఐ 6.1 ఆధారంగా ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.

కెమెరా, వీడియోగ్రఫీ సెటప్ :

కెమెరా విషయానికొస్తే.. ఇందులో LED ఫ్లాష్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 50MP, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

బ్యాటరీ లైఫ్ :
పవర్ విషయానికొస్తే.. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది. Wi-Fi, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ పోర్ట్, ఏఐ వంటి ఫీచర్లతో వస్తుంది. అదనంగా, మీరు ఇతర శాంసంగ్ ఫోన్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. భారీ డిస్కౌంట్ ఆఫర్‌లతో ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.