Samsung Galaxy S23 Ultra 5G : అమెజాన్ బంపర్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Samsung Galaxy S23 Ultra 5G : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ ధర భారీగా తగ్గింది. ధర ఎంత తగ్గిందంటే?

Samsung Galaxy S23 Ultra 5G : అమెజాన్ బంపర్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Samsung Galaxy S23 Ultra 5G

Updated On : May 26, 2025 / 2:20 PM IST

Samsung Galaxy S23 Ultra 5G : శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ నుంచి అల్ట్రా వేరియంట్‌ను (Samsung Galaxy S23 Ultra 5G) అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో సేల్ సమయంలో కస్టమర్‌లు అమెజాన్‌లో రూ.34,969 తగ్గింపు పొందవచ్చు. వాస్తవానికి, శాంసంగ్ స్టోర్‌లో ఈ 5జీ ఫోన్ దాదాపు రూ.1,19,999 ధరకు అందుబాటులో ఉంది.

Read Also : iPhone 17 Pro Max : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. డిజైన్, ధర, కెమెరా ఫీచర్లు ఇవేనా..?

హార్డ్‌వేర్, ఏఐ ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఫోన్ S పెన్ సపోర్ట్, క్వాడ్ కెమెరా సెటప్‌ కూడా కలిగి ఉంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ధర రూ.85వేల ధరలో పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గెలాక్సీ S23 అల్ట్రా 5G ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌ టాప్ వేరియంట్ అమెజాన్‌లో రూ.87,659కి అందుబాటులో ఉంది. రూ.1,19,900 నుంచి భారీ తగ్గింపు పొందింది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కస్టమర్లు రూ.2,629 తగ్గింపు పొందవచ్చు.

ఈ ఫోన్ ధర దాదాపు రూ.85వేలకి తగ్గుతుంది. కొనుగోలుదారులు ఈఎంఐ కూడా ఎంచుకోవచ్చు. నెలకు రూ.4,250 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు.

అలాగే, పాత ఫోన్లపై ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్ వాల్యూను బట్టి రూ. 68,850 వరకు తగ్గింపు ఉంటుంది. 2 ఏళ్ల పాత గెలాక్సీ S23 ప్లస్ 5G ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్ వాల్యూ రూ. 27,300గా ఉంది. కస్టమర్లు అదనంగా శాంసంగ్ కేర్ ప్లస్, టోటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ యాడ్-ఆన్‌గా పొందవచ్చు.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్ 6.8-అంగుళాల 120Hz QHD+ డైనమిక్ అమోల్డ్ 2X ప్యానెల్‌ కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, 1,750 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ కలిగి ఉంది. బాక్స్ బయట వన్ యూఐ 7పై రన్ అవుతుంది. ఏఐ ఫీచర్లకు కూడా సపోర్టు ఇస్తుంది.

45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. 200MP ప్రైమరీ కెమెరాతో పాటు 12MP అల్ట్రావైడ్ సెటప్‌ను అందిస్తుంది.

Read Also : Samsung Galaxy S23 Plus 5G : కొత్త ఫోన్ కావాలా? ఈ శాంసంగ్ 5G ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ మీకోసమే..!

3x జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్, 10x జూమ్‌, 10MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది.