iPhone 17 Pro Max : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. డిజైన్, ధర, కెమెరా ఫీచర్లు ఇవేనా..?
iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది. లాంచ్ కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

iPhone 17 Pro Max
iPhone 17 Pro Max : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో కొత్త ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. ఐఫోన్ కొత్త లైనప్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లాంచ్ చేయనుంది.
Read Also : iPhone 16 Pro : ఐఫోన్ యూజర్లకు పండగే.. ఐఫోన్ 16ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్.. ధర ఎంత తగ్గిందంటే?
లీక్ డేటాను పరిశీలిస్తే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిజైన్, ఫీచర్ మరిన్ని అప్‌గ్రేడ్‌లతో రావచ్చు. ఐఫోన్ 17 అల్ట్రాగారీబ్రాండ్ చేసే అవకాశం కూడా ఉంది. రీడిజైన్ బాడీ, అద్భుతమైన కెమెరాలతో ఐఫోన్ 17 ప్రో మాక్స్ రానుంది.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ సెప్టెంబర్ 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆపిల్ కచ్చితమైన లాంచ్ తేదీని రివీల్ చేయలేదు.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఐఫోన్ 17 ప్రో మాక్స్ (iPhone 17 Pro Max) 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో రానుంది. హుడ్ కింద ఆపిల్ A19 ప్రో చిప్ అందించనుంది. 12GB ర్యామ్ కూడా ఉండొచ్చు. ఈ ఐఫోన్ iOS19తో లాంచ్ అవుతుందని అంచనా.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ బ్యాక్ సైడ్ 48MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 24MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంటుంది. ఫోన్ కూలింగ్ కోసం స్టీమ్ కూలింగ్ రూమ్ ఉండవచ్చు. ఈ ఐఫోన్ 4,685mAh బ్యాటరీతో రానుంది.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిజైన్ (అంచనా) :
ఆపిల్ ప్రో మాక్స్‌లో (iPhone 17 Pro Max) పిక్సెల్-స్టయిల్ కెమెరా బార్ ఉండవచ్చు. LiDAR సెన్సార్, మైక్రోఫోన్, ఫ్లాష్ రైట్ సైడ్ ఉంచవచ్చు. ఆపిల్ టైటానియం ఫ్రేమ్ బదులుగా అల్యూమినియం కలిగి ఉండవచ్చు.
భారత్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర (అంచనా) :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ రూ.1,44,900 ధరకు లాంచ్ అవుతుందని అంచనా. లీకుల ఆధారంగా ఐఫోన్ ధరపై అనేక అంచనాలు నెలకొన్నాయి.