iPhone 16 Pro : ఐఫోన్ యూజర్లకు పండగే.. ఐఫోన్ 16ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్.. ధర ఎంత తగ్గిందంటే?
iPhone 16 Pro : ఐఫోన్ 16 ప్రో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్ ద్వారా రూ. 14,010 తగ్గింపు పొందింది.

iPhone 16 Pro
iPhone 16 Pro : ఆపిల్ అభిమానులకు పండగే.. కొత్త ఐఫోన్ 16 ప్రో కొనాలని చూస్తున్నారా? మీకో అద్భుతమైన ఆఫర్.. విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ ద్వారా మీరు ఐఫోన్ 16 ప్రో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఆపిల్ ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ 16 ప్రో విషయానికి వస్తే.. బ్యాంక్ ఆఫర్లు, ధర తగ్గింపుతో కస్టమర్‌లు ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో రూ. 14వేల కన్నా ఎక్కువ సేవింగ్ చేయవచ్చు.
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో దాదాపు రూ.1,20,000 ధరతో లాంచ్ అయింది. ప్రీమియం ఫీచర్లు, ట్రిపుల్ కెమెరా, 120hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్‌రెటినా డిస్‌ప్లే, కెమెరా కంట్రోల్స్, ఏఐ ఫీచర్లు వంటి స్పెషిఫికేషన్లను కలిగి ఉంది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్రో ధర ఎంత తగ్గిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 16 ప్రో ధర ఎంతంటే? :
ఐఫోన్ 16 ప్రోపై (iPhone 16 Pro) రూ.1,19,900 నుంచి రూ.1,09,490కి పొందవచ్చు. HDFC, ICICI సహా ఇతర ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.4,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ కూడా పొందవచ్చు. పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది.
24 నెలల పాటు నెలకు రూ.5,214తో ఈఎంఐ, నో-కాస్ట్ ఈఎంఐలను ఎంచుకోవచ్చు. కస్టమర్లు రూ.821 విలువైన 821 పాయింట్లను పొందవచ్చు. ఇతర కొనుగోళ్లపై రీడీమ్ చేసుకోవచ్చు. 128GB వేరియంట్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR ప్యానెల్‌ను కలిగి ఉంది. 3nm ఫ్యాబ్రికేటెడ్ A18 ప్రో చిప్‌సెట్, అనేక ఏఐ ఫీచర్లతో వస్తుంది. హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్‌తో వస్తుంది. అద్భుతమైన గేమింగ్‌ను అందిస్తుంది. ఐఫోన్ 15 ప్రోతో పోలిస్తే.. ఈ ఐఫోన్ 20 శాతం మెరుగైన బ్యాటరీని అందిస్తుంది.
లేటెస్ట్ iOS 18.4 అప్‌డేట్‌పై రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే.. క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో 48MP ఫ్యూజన్ కెమెరాతో పాటు 12MP 5x టెలిఫోటో కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది.