Upcoming Smartphones : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వచ్చే జూన్‌లో ఖతర్నాక్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఫుల్ డిటెయిల్స్..!
Upcoming Smartphones : జూన్ నెలలో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లకు సంబంధించి అనేక వివరాలు వెల్లడయ్యాయి..

Upcoming Smartphones
Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. వచ్చే జూన్ 2025లో అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నాయి. ప్రీమియం, మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో కొత్త మోడళ్లు భారతీయ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.
Read Also : India Economy : జపాన్‌ను అధిగమించిన భారత్.. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ..!
రాబోయే స్మార్ట్ ఫోన్లలో వన్‌ప్లస్ 13s, నథింగ్ ఫోన్ 3, వివో T4 అల్ట్రా, ఇన్ఫినిక్స్ GT30 ఉండనున్నాయి. ఈ టాప్ 4 స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ఫుల్ డిటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
వన్‌ప్లస్ 13s:
వన్‌ప్లస్ 13s ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రావచ్చు. 6.32-అంగుళాల OLED డిస్‌ప్లే, డ్యూయల్ 50MP రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉండవచ్చు.
80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,260mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. ఈ వన్‌ప్లస్ 13s ధర దాదాపు రూ.49,990 ఉండే అవకాశం ఉంది. వచ్చే జూన్ 5న ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
నథింగ్ ఫోన్ 3 :
నథింగ్ నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ (Upcoming Smartphones) లో స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. కెమెరా సెటప్‌లో ట్రిపుల్-లెన్స్ కాన్ఫిగరేషన్‌తో పాటు 64MP ప్రైమరీ లెన్స్ ఉండవచ్చు.
100W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. ధర రూ. 44,999 ఉండవచ్చు. వచ్చే జూన్‌లో ఈ నథింగ్ ఫోన్ 3 లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వివో T4 అల్ట్రా :
వివో T4 అల్ట్రా ఫోన్ (Upcoming Smartphones) వస్తోంది. 50MP సోనీ IMX921 సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 3X జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్, 10X మాక్రో లెన్స్‌తో కూడిన T4 అల్ట్రాను లాంచ్ చేయనుంది.
ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల pOLED డిస్‌ప్లే కూడా ఉండవచ్చు. వచ్చే జూన్ మధ్యలో ఎప్పుడైనా రావొచ్చు.
ఇన్ఫినిక్స్ GT30 :
మొబైల్ గేమర్ల కోసం ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త GT30 గేమింగ్ ఫోన్ లాంచ్ కానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, బిగ్ బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
ఈ ఇన్ఫినిక్స్ GT30 ధర దాదాపు రూ. 25వేలు ఉండవచ్చు. ఒప్పో ఫైండ్ X8 అల్ట్రాను ఇంకా లాంచ్ చేయలేదు. వివో X200 ప్రో పోర్టబుల్ వెర్షన్‌ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.