OnePlus 12 Offer : వన్‌ప్లస్ 12పై అదిరిపోయే ఆఫర్లు.. వన్‌ప్లస్ 13R కన్నా బెటర్ ఫీచర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!

OnePlus 12 Offer : వన్‌ప్లస్ 12పై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 26,300 విలువైన ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.

OnePlus 12 Offer : వన్‌ప్లస్ 12పై అదిరిపోయే ఆఫర్లు.. వన్‌ప్లస్ 13R కన్నా బెటర్ ఫీచర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!

OnePlus 12 Offer

Updated On : May 25, 2025 / 2:08 PM IST

OnePlus 12 Offer : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 12 ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ (OnePlus 12 Offer) కొనుగోలుపై ఫ్రీగా వన్‌ప్లస్ ఇయర్‌బడ్‌ కూడా సొంతం చేసుకోవచ్చు.

Read Also : India Economy : జపాన్‌‌ను అధిగమించిన భారత్.. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ..!

వన్‌ప్లస్ 13R కొనేవారికి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 12 స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఆప్షన్. కంపెనీ ఇటీవలే వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R ఫోన్లను లాంచ్ చేసినప్పటికీ, ప్రస్తుతం వన్‌ప్లస్ 12లో 13R కన్నా ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. అమెజాన్ రూ. 7,299 విలువైన వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

వన్‌ప్లస్ 12పై బిగ్ డిస్కౌంట్ :
వన్‌ప్లస్ 12 ఫోన్ గత ఏడాది జనవరిలో లాంచ్ అయింది. లాంచ్ సమయంలో 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో బేస్ మోడల్ ధర రూ.64,999కు ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వేరియంట్‌ను అమెజాన్ కేవలం రూ.51,998కే అందిస్తోంది.

ఆసక్తిగల కొనుగోలుదారులు SBI లేదా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో రూ.6వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.45,998కి తగ్గింది.

రూ.7,299 విలువైన వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 ఫ్రీగా పొందవచ్చు. వన్‌ప్లస్ 13R అదే వేరియంట్ ధర రూ. 33,999కు బ్యాంక్ డిస్కౌంట్‌తో అందిస్తుంది.

ఈ వన్‌ప్లస్ ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3తో అద్భుతైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి. వన్‌ప్లస్ 13R కన్నా వన్‌ప్లస్ 12 మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

కెమెరా సిస్టమ్ పరంగా మల్టీఫేస్ 48MP అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్‌, 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. వన్‌‌ప్లస్ 12 ఫోటోగ్రఫీతో పాటు 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు హై రిజల్యూషన్‌ను అందిస్తుంది.

వన్‌ప్లస్ 12 భారీ 6.82-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 50W AIRVOOC వైర్‌లెస్ ఛార్జింగ్‌ అందిస్తుంది. ఈ ఫీచర్ వన్‌ప్లస్ 13Rలో లేదు. వన్‌ప్లస్ 13R భారీ 6,000mAh సింగిల్-సెల్ బ్యాటరీతో వస్తుంది.

Read Also : Best Camera Phones : ఇలాంటి కెమెరా ఫోన్లు కొనాలి.. రూ. 75వేల లోపు టాప్ రేంజ్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే..

కానీ, వన్‌ప్లస్ 12 5,400mAh డ్యూయల్-సెల్ బ్యాటరీతో వస్తుంది. 100W సూపర్‌‌వూక్ వైర్డ్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును అందిస్తుంది.