Best Camera Phones : ఇలాంటి కెమెరా ఫోన్లు కొనాలి.. రూ. 75వేల లోపు టాప్ రేంజ్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Best Camera Phones : అద్భుతమైన కెమెరా ఫీచర్లతో హై ఎండ్ స్మార్ట్‌ఫోన్లు రూ. 75వేల లోపు ధరలో అందుబాటులో ఉన్నాయి.

Best Camera Phones : ఇలాంటి కెమెరా ఫోన్లు కొనాలి.. రూ. 75వేల లోపు టాప్ రేంజ్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Best Camera Phones

Updated On : May 25, 2025 / 1:22 PM IST

Best Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అద్భుతమైన కెమెరా ఫీచర్లు కలిగిన హైఎండ్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో (Best Camera Phones) అందుబాటులో ఉన్నాయి.

రూ. 75వేల లోపు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. మీరు ఫోటోగ్రఫీ ఔత్సాహికులైతే స్పెక్స్, హై-రిజల్యూషన్ సెన్సార్లు, అత్యాధునిక ఇమేజింగ్ ఫీచర్లు కలిగిన ఈ టాప్ 5 కెమెరా ఫోన్‌లను ఓసారి లుక్కేయండి..

Read Also : ITR Deadline : ఐటీఆర్ డెడ్‌లైన్.. గడువు దాటితే అంతే.. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేసేటప్పుడు ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు..!

వివో X200 :
వివో స్మార్ట్ ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 9400 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ 50MP మెయిన్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌ను అందిస్తుంది.

మరోవైపు, 32MP ఫ్రంట్ కెమెరా, హై రిజల్యూషన్ సెల్ఫీలను తీయొచ్చు. ఈ వివో ఫోన్ ధర రూ. 65,999 నుంచి కొనుగోలు చేయొచ్చు.

వన్‌ప్లస్ 13 :
వన్‌ప్లస్ 13 ఫోన్ 6.82-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ ద్వారా పవర్ పొందుతుంది.

ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా కలిగి ఉంది. ఈ వివో ఫోన్ ధర రూ. 69,997 నుంచి అందుబాటులో ఉంది.

ఐఫోన్ 16 :
ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. A18 చిప్, రియర్ కెమెరాలలో 48MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీలు, ఫేస్‌టైమ్ కాల్స్ కోసం 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఈ వివో ఫోన్ ధర రూ. 74,900 నుంచి లభ్యమవుతుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 :
శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది.

50MP ప్రైమరీ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ వైడ్ లెన్స్‌తో 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ వివో ఫోన్ ధర రూ. 74,999 నుంచి కొనేసుకోవచ్చు.

ఒప్పో ఫైండ్ X8 :
6.59-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ఉన్నాయి. కెమెరా విషయానికి వస్తే.. 50MP వైడ్-యాంగిల్ ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుంది.

Read Also : India Economy : జపాన్‌‌ను అధిగమించిన భారత్.. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ..!

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ వివో ఫోన్ ధర రూ. 68,999 నుంచి లభ్యమవుతుంది.