Post Office Scheme : పోస్టాఫీసులో ఇలా ఇన్వెస్ట్ చేస్తే అన్ని లాభాలే.. రూ. లక్ష పెట్టుబడితో ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
Post Office Scheme : పోస్టాఫీసు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లో రూ. లక్ష లేదా రూ. 2 లక్షలు పెట్టుబడితో ఎంత మొత్తంలో వడ్డీ వస్తుందంటే?

Post Office Scheme
Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసులో (Post Office Scheme) పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక వ్యవధిలో భారీ రాబడులను పొందవచ్చు.
ఇటీవల ఆర్బీఐ రెపో రేటును తగ్గించడంతో అనేక బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. మంచి రాబడిని పొందాలంటే ఈసారి బ్యాంకులో కాకుండా పోస్టాఫీస్‌లో పెట్టుబడి పెట్టండి.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)లో మంచి వడ్డీతో పాటు టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. పోస్టాఫీసులో రూ. లక్షనుంచి రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వడ్డీ రేటు ఎంత? :
పోస్టాఫీసు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ డిపాజిట్ స్కీమ్ అందిస్తోంది. ఈ పథకంలో 5 ఏళ్లు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం 7.7 శాతం వడ్డీని అందిస్తోంది.
రూ. 5 లక్షలు డిపాజిట్.. :
ఒకేసారి రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే.. 7.7శాతం రేటుతో రూ.2,24,517 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ మొత్తం రూ.7,24,517 పొందవచ్చు.
రూ. 4 లక్షలు డిపాజిట్.. :
NSCలో రూ. 4లక్షలుపెట్టుబడి పెడితే.. 7.7శాతం రేటుతో రూ. 1,79,614 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 5,79,614 అవుతుంది.
రూ. 3 లక్షలు డిపాజిట్ చేస్తే.. :
రూ. 3లక్షలపెట్టుబడి పెడితే 7.7శాతం రేటుతో రూ. 1,34,710 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ మొత్తంగా రూ. 4,34,710 పొందవచ్చు.
రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే.. :
రూ. 2లక్షలు పెట్టుబడి పెడితే 7.7శాతం రేటుతో రూ. 89,807 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ మొత్తంగా రూ. 2,89,807 పొందవచ్చు.
రూ. లక్ష డిపాజిట్ చేస్తే రాబడి ఎంత? :
NSCలో రూ.లక్ష పెట్టుబడి పెడితే 7.7 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీపై రూ.1,44,903 వస్తుంది. వడ్డీగా రూ.44,903 పొందవచ్చు.
పన్ను ప్రయోజనాలివే :
ఈ NSC పథకంలో పెట్టుబడిని రూ. వెయ్యి నుంచి ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. పెట్టుబడితో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
ఎవరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు :
భారతీయ పౌరుడు ఎవరైనా ఇందులో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్ సౌకర్యం కూడా ఉంది. మైనర్ వ్యక్తి తరపున గార్డియన్స్ పెట్టుబడి పెట్టవచ్చు.
10 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న మైనర్లు సొంత పేరుతో అకౌంట్ తీసుకోవచ్చు. తేదీ, మెచ్యూరిటీ తేదీ మధ్య ఒకసారి NSC అకౌంట్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి ట్రాన్స్‌ఫర్ కూడా చేయవచ్చు.
ప్రీమెచ్యూర్ క్లోజర్ రూల్స్ :
NSC స్కీమ్ కింద 5 ఏళ్లలో మెచ్యూరిటీ అవుతుంది. పెట్టుబడి తర్వాత పెట్టుబడి సమయంలో అదే వడ్డీ రేటు మొత్తం 5 ఏళ్లకు వర్తిస్తుంది. NSCలోప్రీమెచ్యూర్ క్లోజర్ ఆప్షన్ లేదు.
ఖాతాదారుడి మరణం, జాయింట్ అకౌంట్ విషయంలో ఖాతాదారులిద్దరూ మరణించడం లేదా ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే ముందుగా అకౌంట్ క్లోజ్ చేసే వీలుంది.