Samsung Galaxy S23 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్.. సెప్టెంబర్ 22 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌కు ముందుగానే శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. రూ.80వేల బడ్జెట్ లోపు ఈ అల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ మీ కోసమే. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ అందించే శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్ అమెజాన్‌లో రూ.43,900 కన్నా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
2/6
వాస్తవానికి ఈ శాంసంగ్ ఫోన్ అసలు ధర రూ.1,19,900 ఉండగా ట్రిపుల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, S పెన్ సపోర్ట్, ప్రీమియం డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ధర : అమెజాన్‌లో రూ. 41,900 తగ్గింపు తర్వాత శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ రూ. 78వేల ధరకు అందుబాటులో ఉంది. కస్టమర్లు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌తో రూ. 2,340 కూడా తగ్గింపు పొందవచ్చు. దాంతో శాంసంగ్ 5జీ ఫోన్ ధర రూ. 76వేల కన్నా తగ్గుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు నెలకు రూ. 3,782తో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. అయితే, బ్యాంక్‌ని బట్టి ప్రాసెసింగ్ ఫీజులు, అదనపు ఛార్జీలు ఉండవచ్చు.
4/6
కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్లు, బ్రాండ్ మోడల్‌ను బట్టి రూ.44వేల వరకు వాల్యూను పొందవచ్చు. కస్టమర్లు అదనంగా చెల్లించడం ద్వారా స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్, ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి యాడ్-ఆన్‌లను కూడా పొందవచ్చు.
5/6
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు : ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీని కూడా కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, వన్ యూఐ 8 అప్‌డేట్ కూడా పొందుతుంది.
6/6
కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 200MP మెయిన్ సెన్సార్, 10MP పెరిస్కోప్ లెన్స్, 10MP టెలిఫోటో, 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. 12MP సెల్ఫీ కెమెరా కూడా అందిస్తుంది.