Samsung Galaxy S24 FE 5G : శాంసంగ్ లవర్స్ డోంట్ మిస్.. రూ. 60వేల శాంసంగ్ 5G ఫోన్ ధర కేవలం రూ.34,999 మాత్రమే..!

Samsung Galaxy S24 FE 5G : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే డిస్కౌంట్.. రూ. 60వేల విలువైన గెలాక్సీ 5G ఫోన్ ధర కేవలం రూ. 34,999 మాత్రమే..

Samsung Galaxy S24 FE 5G : శాంసంగ్ లవర్స్ డోంట్ మిస్.. రూ. 60వేల శాంసంగ్ 5G ఫోన్ ధర కేవలం రూ.34,999 మాత్రమే..!

Samsung Galaxy S24 FE 5G

Updated On : May 22, 2025 / 5:05 PM IST

Samsung Galaxy S24 FE 5G : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. హై-ఎండ్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తుంటే.. ఫ్లాగ్‌షిప్-లెవల్ స్పెసిఫికేషన్లు, డిజైన్‌తో శాంసంగ్ గెలాక్సీ S24 FE 5G (Samsung Galaxy S24 FE 5G) ధర ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపును పొందింది.

Read Also : Vivo T3 Ultra 5G : అతి చౌకైన ధరకే వివో 5G ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనొచ్చు.. వివో లవర్స్ అసలు మిస్ చేసుకోవద్దు..!

128GB వేరియంట్ ధర రూ.59,999గా ఉండగా, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 41 శాతం తగ్గింపుతో కేవలం రూ.34,999కే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుదారులు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన పాత స్మార్ట్‌ఫోన్‌లపై రూ.32,700 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మీ పాత ఫోన్ పర్ఫార్మెన్స్, వర్కింగ్ కండిషన్ బట్టి ధరను తగ్గించవచ్చు. రూ.15వేలు ఎక్స్ఛేంజ్ వాల్యూతో ధర కేవలం రూ.19,999కి తగ్గింపు పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 FE స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 FE అల్యూమినియం ఫ్రేమ్, IP68 రేటింగ్‌తో వస్తుంది. స్టైలిష్‌గా ఎంతో ఆకర్షణయంగా ఉంటుంది. 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎక్సినోస్ 2400e చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.

Read Also : Vivo T4 Ultra : ఖతర్నాక్ ఫీచర్లతో వివో T4 అల్ట్రా ఫోన్ వస్తోంది.. అద్భుతమైన డిస్‌ప్లే, ధర ఎంత ఉండొచ్చంటే?

ఫ్రంట్ సైడ్ కెమెరా ఫోన్ 50MP మెయిన్ సెన్సార్, 8MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.