Vivo T4 Ultra : ఖతర్నాక్ ఫీచర్లతో వివో T4 అల్ట్రా ఫోన్ వస్తోంది.. అద్భుతమైన డిస్‌ప్లే, ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo T4 Ultra : వివో కొత్త అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. 50MP పెరిస్కోప్ కెమెరా, 120Hz క్వాడ్ కర్వడ్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రానుంది.

Vivo T4 Ultra
Vivo T4 Ultra : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి వివో T సిరీస్ లైనప్‌లో కొత్త ఫోన్ రానుంది. వివో T4 అల్ట్రా లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ పొందగా, వివో T3 అల్ట్రా కన్నా అద్భుతమైన పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, కెమెరా, డిజైన్‌ను కలిగి ఉంటుంది.
పెరిస్కోప్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కర్వ్డ్ pOLED ప్యానెల్ ఉండొచ్చు. వివో T3 అల్ట్రాలో OISతో కూడిన 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.
కెమెరా డిస్‌ప్లే, స్పెషిఫికేషన్లు : (Vivo T4 Ultra)
వివో T4 అల్ట్రా ఫోన్ 50MP సోనీ IMX921 మెయిన్ కెమెరా, 50MP 3x పెరిస్కోప్ కెమెరా లెన్స్, 10x టెలిఫోటో మాక్రో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ 16.94cm (6.67-అంగుళాల) pOLED 120Hz క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఐ కేర్ సర్టిఫికేషన్‌తో వస్తుంది.
లాంచ్ తేదీ :
వివో T4 అల్ట్రా (Vivo T4 Ultra) లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. పుకార్ల ప్రకారం.. ఈ వివో ఫోన్ వచ్చే నెలలో భారత మార్కెట్‌లోకి లాంచ్ కావొచ్చు.
వివో T4 అల్ట్రా ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్OS 15తో ప్రీలోడెడ్‌గా రావచ్చు. బ్యాటరీ, వేరియంట్లపై ప్రస్తుతం అధికారిక సమాచారం లేదు.
Read Also : iPhone 16 Plus : భలే డిస్కౌంట్ బాస్.. ఐఫోన్ 16 ప్లస్‌పై ఏకంగా రూ. 11,600 తగ్గింపు.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?
వివో T4 అల్ట్రా ధర (అంచనా) :
భారత మార్కెట్లో వివో T4 అల్ట్రా ధర దాదాపు రూ.34వేలు కావచ్చు. వివో T3 అల్ట్రా బేస్ మోడల్ ధర రూ.31,999కు లాంచ్ అయింది.