iPhone 16 Plus : భలే డిస్కౌంట్ బాస్.. ఐఫోన్ 16 ప్లస్‌పై ఏకంగా రూ. 11,600 తగ్గింపు.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?
iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ పై అద్భుతమైన డిస్కౌంట్.. విజయ్ సేల్స్ ఏకంగా రూ. 11,600 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Apple iPhone 16 Plus
iPhone 16 Plus : కొత్త ఐఫోన్ కావాలా? విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ (iPhone 16 Plus) విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుత ఈ ఆఫర్‌తో రూ. 11,600 వరకు తగ్గింపు పొందవచ్చు.
Read Also : Apple iPhone 15 : బిగ్ డిస్కౌంట్.. అతి చౌకైన ధరకే ఐఫోన్ 15.. ఇది కదా ఆఫర్ అంటే.. కొనేసుకోండి..!
ఐఫోన్ 16 ప్లస్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం ఫోన్ రూ. 82,300కు లిస్టు అయింది.
ఐఫోన్ 16 ప్లస్‌పై రూ. 7,600 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్, HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐఫోన్ 16 ప్లస్ 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద, ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్‌తో అమర్చి ఉంది. పిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లన్నింటికి సపోర్ట్ చేస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. :
ఐఫోన్ 16 ప్లస్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.
ఐఫోన్ 16 ప్లస్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఈ ఐఫోన్ IP68-సర్టిఫైడ్, అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉంది.