Samsung Galaxy S24 : శాంసంగ్ ప్రియులకు బిగ్ డీల్.. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర జస్ట్ ఎంతంటే? డోంట్ మిస్!
Samsung Galaxy S24 : శాంసంగ్ లవర్స్ ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు. అమెజాన్‌లో ఏకంగా రూ. 20వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S24
Samsung Galaxy S24 : శాంసంగ్ అభిమానులకు అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S-సిరీస్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో (Samsung Galaxy S24) అందుబాటులో ఉంది. గతంలో కన్నా చాలా సరసమైన ధరకే లభిస్తోంది.
రూ.20వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ మోడల్‌పై అతిపెద్ద డిస్కౌంట్ ఇదే. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసి శాంసంగ్‌కు మారాలనుకుంటే ఈ డీల్ మీకోమసే.. ఇంతకీ అతి తక్కువ ధరకే ఈ శాంసంగ్ గెలాక్సీ S24 ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 డీల్ :
ప్రస్తుతం శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 రూ.64,999 ధరకు లిస్టు అయింది. అదే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో కేవలం రూ.44,893కే అందుబాటులో ఉంది. రూ.20,106 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఇంకా ఎక్కువ సేవింగ్ చేయొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ (Samsung Galaxy S24 ) 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.2-అంగుళాల LTPO అమోల్డ్ కలిగి ఉంది. హుడ్ కింద, ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. గరిష్టంగా 8GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఇంకా, గెలాక్సీ S24 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.