Lightest Smartphones : ఇలాంటి ఫోన్లు కొనాలి భయ్యా.. 2025లో టాప్ 7 లైట్ వెయిట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. బరువు తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
Lightest Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? లైట్ వెయిట్ ఉండి ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్ల కావాలా? 2025లో టాప్ 7 లైట్ మెయిట్ స్మార్ట్ ఫోన్లు మీకోసం..

Lightest Smartphones
Lightest Smartphones : 2025లో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఎక్కువ ఫీచర్లు ఉండాలి.. ధర తక్కువగా ఉండాలి.. అలాగే పట్టుకునేందుకు మంచి గ్రిప్, లైట్ వెయిట్ ఉండాలి.. (Lightest Smartphones) ఇలాంటి ఫోన్ల కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. చాలామంది కొత్త ఫోన్ కొనేముందు సాధారణంగా స్పీడ్, బ్యాటరీ లైఫ్, కెమెరా క్వాలిటీ గురించి చూస్తుంటారు.. అలాగే ఇప్పుడు ఫోన్ బరువు కూడా లైట్ వెయిట్ ఉండాలని కోరుకుంటున్నారు.
ఫోన్ స్క్రీన్లు పెద్దవిగా ఉండి బ్యాటరీలు 5000mAh మార్కును దాటిపోతున్నాయి. అందుకే మొబైల్ తయారీదారులు స్మార్ట్ డిజైన్, తేలికైన పదార్థాలు, స్ట్రాంగ్ ఇంజనీరింగ్‌తో లైట్ వెయిట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం 2025లో లాంచ్ అయిన 7 లైట్ వెయిట్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఫ్లాగ్‌షిప్, మిడ్‌రేంజ్, ఫోల్డబుల్, బడ్జెట్ కేటగిరీలో కూడా ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని ఇంటికి తెచ్చుకోవచ్చు..
1. శాంసంగ్ గెలాక్సీ S25 (162 గ్రాములు) :
ఈ శాంసంగ్ ఫోన్ కేవలం 162 గ్రాముల బరువు ఉంటుంది. తేలికైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి. 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. క్వాల్‌కామ్‌తో కో-ఇంజనీరింగ్ అయింది. 4000mAh బ్యాటరీ, 50MP మెయిన్ సెన్సార్‌తో ట్రిపుల్-కెమెరా సిస్టమ్ వస్తుంది.
గ్లాస్, మెటల్‌తో తయారైన ఫ్లాగ్‌షిప్ 170 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉంటుంది. కానీ, శాంసంగ్ గత ఏడాదిలో S24 (167 గ్రాముల) కన్నా తక్కువ బరువుతో తీసుకొచ్చింది. 6.2-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, IP68 రేటింగ్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఎండ్ వంటివి మరింత ఆకట్టుకునేలా ఉంటాయి.
2. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ (163 గ్రాములు ) :
ఈ శాంసంగ్ ఎడ్జ్ ఫోన్ పొడవు ఆకట్టుకునేలా సన్నగా ఉంటుంది. కేవలం 5.8mm మందం, 163 గ్రాముల బరువుతో వస్తుంది. ఈ 6.7-అంగుళాల ఫోన్ చిన్న ఫోన్ల కన్నా చాలా తేలికైనది. శాంసంగ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 12GB ర్యామ్ కలిగి ఉంది. టెలిఫోటో లెన్స్ లేదు. బ్యాటరీ సైజు 3900mAh మాత్రమే. మీరు డిజైన్‌కు ప్రాధాన్యత ఇస్తే ఇదే బెటర్. శాంసంగ్ 2025 అత్యంత తేలికైన “ఫ్యాబ్లెట్-క్లాస్” ఫ్లాగ్‌షిప్ అని చెప్పవచ్చు. చేతిలో తేలికగా ఉంటుంది.
3. షావోమీ 15 (189–191 గ్రాములు)
షావోమీ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ సాధారణ ప్రీమియం ( Lightest Smartphones) ఫోన్ లాగా అనిపిస్తుంది. కానీ, 5240mAh బ్యాటరీతో 191 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉంటుంది. షావోమీ 15 సగటు కన్నా తక్కువే. 6.36-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, లైకా-ట్యూన్ ట్రిపుల్ 50MP కెమెరా సిస్టమ్ కలిగి ఉంది.
90W వైర్డు ఛార్జింగ్, సన్నని 8.1mm ప్రొఫైల్‌తో వస్తుంది. 5000mAh+ బ్యాటరీలు కలిగిన చాలా ఫ్లాగ్‌షిప్‌లు 210 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉంటాయి. షావోమీ 15 డిజైన్, పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది.
4. గూగుల్ పిక్సెల్ 9a (186 గ్రాములు)
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ సైజు, బరువు చాలా తక్కువగా ఉంటుంది. 185.9 గ్రాముల వద్ద గూగుల్ 2025 లైనప్‌లో అత్యంత తేలికైన ఫోన్. ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 9 కన్నా కూడా చాలా తేలికైనది. ఇప్పటికీ 6.3-అంగుళాల OLED స్క్రీన్, లేటెస్ట్ టెన్సర్ G4 చిప్, 5100mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ డిజైన్ క్లీన్‌గా ఉంటుంది.
ప్లాస్టిక్-అల్యూమినియం ఫ్రేమ్ కారణంగా బరువు తక్కువగా ఉంటుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, IP67 వాటర్ రెసిస్టెన్స్, డ్యూయల్-కెమెరా సెటప్ (48MP మెయిన్ + 13MP అల్ట్రావైడ్) ఉన్నాయి. పిక్సెల్ 9a ఫోన్ చేతిలో పట్టుకునేందుకు చాలా తేలికగా ఉంటుంది.
5. వివో V50 (189 గ్రాములు ) :
వివో మిడ్‌రేంజ్ ఫోన్లకు పెట్టింది పేరు. వివో V50 కూడా అలానే వచ్చింది. 6.7-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 5000mAh బ్యాటరీతో కొంచెం పెద్దదిగా అనిపించవచ్చు. కానీ, 189 గ్రాముల బరువుతో వివో V50 శాటిన్ బ్లాక్ ఎడిషన్ చాలా తేలికగా ఉంటుంది.
200 గ్రాముల కన్నా ఎక్కువ బరువున్న ఇలాంటి ఫోన్‌లతో పోలిస్తే చాలా లైట్ వెయిట్ అనమాట.. 12GB వరకు ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌తో రన్ అవుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. డ్యూయల్ 50MP కెమెరాలు ఉన్నాయి. 7.4mm సన్నగా మంచి గ్రిప్, ఈజీగా జేబులో పెట్టుకునేలా ఉంటుంది. పాలిష్ డిజైన్ మరింత స్టైలిష్‌గా ఉంటుంది.
Read Also : XChat Launch : వాట్సాప్ ఇక కాస్కో.. మస్క్ ‘XChat’ వస్తోందోచ్.. ఈవారంలోనే లాంచ్.. ఫుల్ ప్రైవసీ ఫీచర్లతో..!
6. మోటోరోలా రేజర్ అల్ట్రా 2025 (199 గ్రాములు)
ఫోల్డబుల్స్ ఫోన్లలో మోటోరోలా 2025 రేజర్ అల్ట్రా కూడా ఒకటి. 7-అంగుళాల లోపలి స్క్రీన్, 4-అంగుళాల బయటి డిస్‌ప్లే, భారీ 4700mAh బ్యాటరీ ఉంది. ఈ రేజర్ అల్ట్రా బరువు కేవలం 199 గ్రాములు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 16GB ర్యామ్, టైటానియం హింజ్ కలిగి ఉంది. శాంసంగ్ Z ఫ్లిప్ 6 (2024) చిన్న బ్యాటరీతో దాదాపు 188 గ్రాముల బరువు ఉంటుంది. మోటోరోలా రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
7. టెక్నో స్పార్క్ స్లిమ్ (166 గ్రాములు) :
టెక్నో స్పార్క్ స్లిమ్ ఫోన్ అత్యంత సన్నిని ఫోన్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. MWC 2025లో ఈ ఫోన్‌ను టెక్నో లాంచ్ చేసింది. కేవలం 5.75mm మందం, 166 గ్రాముల బరువు ఉంటుంది. 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. బడ్జెట్ కేటగిరీలో కూడా సన్నది అలాగే తేలికగా ఉంటుంది.